రష్మికకు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌.. అదేంటో తెలుసా? | Rashmika Mandanna Fans Request In Twitter Goes viral | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మా కోసమైనా అలా మాట్లాడండి.. రష్మికకు ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌!

Published Tue, May 28 2024 4:18 PM | Last Updated on Tue, May 28 2024 4:43 PM

Rashmika Mandanna Fans Request In Twitter Goes viral

పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నెల 29న పుష్ప-2 రెండో సింగిల్‌ కూడా రిలీజ్‌ చేయనున్నారు. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్‌తో దేశవ్యాప్తంగా కూడా ఆమెకు ఫ్యాన్స్‌ ఉన్నారు. తాజాగా రష్మిక టాలీవుడ్‌ మూవీ గంగం గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైంది.

అయితే రష్మికకు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్‌ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఫోటోను షేర్ ‍చేస్తూ ట్వీట్‌ చేశారు. రష్మిక ఈవెంట్‌లో మీరు చాలా అందంగా కనిపించారు..మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది.. కానీ మీరు తెలుగులో మాట్లాడటంతో మాకు అర్థం కాలేదు. నార్త్‌లోనూ మీ అభిమానులు మీ మాటలు వినడానికి ఎంతో ఇష్టపడతారు. అలాంటి వారికోసం ఇంగ్లీషులో మాట్లాడాలని ట్విటర్‌ వేదికగా రష్మికను కోరారు. దయచేసి మా అభ్యర్థనను పరిశీలించవలసిందిగా కోరుతున్నాం అంటూ పోస్ట్‌ చేశారు. అయితే దీనికి రష్మిక సైతం రిప్లై ఇచ్చింది.

రష్మిక ట్వీట్‌ రాస్తూ..' మీరు ఎక్కడి నుంచి వచ్చినా.. మీరందరూ నన్ను అర్థం చేసుకునేలా ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. చాలామంది వారి స్థానిక భాషలోనే మాట్లాడాలని కోరుకుంటారు. వారి భాషపై ఉన్న గౌరవంతో అలా మాట్లాడుతా.  దక్షిణాదితో పాటు మీలాంటి ఫ్యాన్స్‌ కోసం ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తా' అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement