సంక్రాంతికి సీటీమార్‌? | Gopichand seetimaarr shooting beginning shortly | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి సీటీమార్‌?

Published Sun, Sep 20 2020 5:41 AM | Last Updated on Sun, Sep 20 2020 5:41 AM

Gopichand seetimaarr shooting beginning shortly - Sakshi

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా కథానాయిక. రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవన్షీ కీలక పాత్రలో నటిస్తున్నారు.  కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ పాత్రల్లో కనిపించనున్నారు. కోవిడ్‌ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతానికి పైగా  పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్‌ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్స్‌లో తీసుకురావాలన్నది ప్లాన్‌ అని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement