
సింగిల్ సిట్టింగ్‌లో...సంపత్‌నందికి ఓకే!
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాను ‘ఓకే’ చేసేయడం రవితేజ శైలి. ప్రస్తుతం ఆయన ‘కిక్-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ వేడిలోనే... సంపత్‌నంది సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కిక్-2’ చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే... ఆయన సంపత్‌నంది సినిమా సెట్‌లోకి ఎంటరవుతారన్నమాట. ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ -‘‘సింగిల్ సిట్టింగ్‌లో సంపత్‌నంది కథ ఓకే చేశాను. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అంశాలున్న కథ ఇది.
వినోదాన్ని పంచడంలో సంపత్‌నందిది ఓ భిన్నమైన శైలి. వాణిజ్యవిలువలతో కూడిన పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని సంపత్ తీర్చిదిద్దుతాడని నా నమ్మకం. ‘కిక్-2’ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది’’ అని తెలిపారు. ‘‘నాపై నమ్మకంతో సింగిల్ సిట్టింగ్‌లో నా కథను ఓకే చేసిన రవితేజగారికి ధన్యవాదాలు. ఆయనతో సినిమా చేయాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తా. ఇద్దరు కథానాయికలు ఇందులో నటిస్తారు. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని సంపత్‌నంది చెప్పారు.