హంసానందినితో పోటా పోటీగా... | Hansanandini secured competitive with ... | Sakshi
Sakshi News home page

హంసానందినితో పోటా పోటీగా...

Published Thu, Aug 13 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

హంసానందినితో పోటా పోటీగా...

హంసానందినితో పోటా పోటీగా...

మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఇస్తే, రవితేజ ఓ రేంజ్‌లో రెచ్చిపోతారు. చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తారు.

మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఇస్తే, రవితేజ ఓ రేంజ్‌లో రెచ్చిపోతారు. చాలా ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తారు. ప్రస్తుతం రవితేజ ఆ పని మీదే ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘బెంగాల్ టైగర్’. ఈ చిత్రంలో రవితేజ ఇంట్రడక్షన్ సాంగ్‌ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.
 
 ఈ పాటలో రవితేజతో కలిసి కాలు కదుపుతున్నది ఎవరో కాదు ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే...’ పాటలో చాలా హాట్‌గా కపిపించడంతో పాటు డ్యాన్స్ అదరగొట్టి, ఆ తర్వాత పలు ఐటమ్ సాంగ్స్ చేసిన హంసా నందిని డ్యాన్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు 120 మంది డ్యాన్సర్లు పాల్గొనగా కన్నడ కొరియోగ్రాఫర్, దర్శకుడు హర్ష నేతృత్వంలో ఈ పాట చిత్రీకరిస్తున్నారు.
 
 ఈ పరిచయ పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, మాస్ పల్స్ తెలిసిన సంపత్ నంది ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నా రని నిర్మాత తెలిపారు. రవితేజ. హంసా నందిని పోటాపోటీగా డ్యాన్స్ చేస్తున్నారని, ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ సినిమా ఇదని దర్శకుడు అన్నారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్,  సంగీతం: భీమ్స్, ఎడిటింగ్: గౌతంరాజు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement