Sampath Nandi Visits Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సంపత్ నంది వెంట కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పలువురు ఉన్నారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశామని సంపత్ నంది తెలిపారు. త్వరలో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంపత్ నంది 'బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్' చిత్రాలకు కథ అందించారు.
'ఏమైంది ఈవేళ' సినిమాతో తెరంగ్రేటం చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రచ్చ' చిత్రంతో హిట్ కొట్టిన డైరెక్టర్ సంపత్ నంది. తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దర్శకుడిగానే కాకుండా పేపర్ బాయ్, గాలిపటం సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన సిటీమార్ 2021లో భారీ హిట్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో గోపిచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఇదీ చదవండి: పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది
Comments
Please login to add a commentAdd a comment