Raja Rajeshwara Swamy Temple
-
PM Narendra Modi: వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
Vemulawada : వేములవాడ ఆలయంలో రాజన్న కల్యాణ మహోత్సవం (ఫొటోలు)
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు
Sampath Nandi Visits Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సంపత్ నంది వెంట కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పలువురు ఉన్నారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశామని సంపత్ నంది తెలిపారు. త్వరలో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంపత్ నంది 'బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్' చిత్రాలకు కథ అందించారు. 'ఏమైంది ఈవేళ' సినిమాతో తెరంగ్రేటం చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రచ్చ' చిత్రంతో హిట్ కొట్టిన డైరెక్టర్ సంపత్ నంది. తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దర్శకుడిగానే కాకుండా పేపర్ బాయ్, గాలిపటం సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన సిటీమార్ 2021లో భారీ హిట్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో గోపిచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదీ చదవండి: పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది -
రాజన్న పుష్కరిణికి గోదారమ్మ నీళ్లు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మ పుష్కరిణిలోకి గోదారమ్మ నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో భక్తులు సంబరపడిపోతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యస్నానాలు చేస్తూ రాజన్న దర్శనం కోసం వెళుతున్నారు. మిడ్ మానే రు నుంచి పైప్‌లైన్ ద్వారా రాజన్న ధర్మగుండంలోకి గోదా వరి నీళ్లు వచ్చి చేరుతుండటంతో భక్తులకు నీళ్ల తిప్పలు తప్పాయంటూ అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ధర్మగుండాని నీటి కొరత ఉండేది. ఇటీవల కాలంలో ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయడంతో మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా నేరుగా రాజన్న ధర్మగుండానికి నీళ్లు వస్తున్నాయి. ఇకనుంచి ధర్మగుండంలో ఏడాది పొడవునా నీరు ఉండేలా చూస్తామని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. -
రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
వేమలవాడ: శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అర్జిత సేవలు నిలిపివేసి భక్తులకు లఘుదర్శనాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ఉదయం సాయంత్రం రాజరాజేశ్వరీదేవికి చతుషష్ఠి ఉపాచారాలతో విశేషపూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం శ్రీమహాలక్ష్మి అమ్మవారికి షోడషోపచార పూజలు నిర్వహించనున్నారు.