
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మ పుష్కరిణిలోకి గోదారమ్మ నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో భక్తులు సంబరపడిపోతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యస్నానాలు చేస్తూ రాజన్న దర్శనం కోసం వెళుతున్నారు. మిడ్ మానే రు నుంచి పైప్‌లైన్ ద్వారా రాజన్న ధర్మగుండంలోకి గోదా వరి నీళ్లు వచ్చి చేరుతుండటంతో భక్తులకు నీళ్ల తిప్పలు తప్పాయంటూ అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లు ధర్మగుండాని నీటి కొరత ఉండేది. ఇటీవల కాలంలో ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయడంతో మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా నేరుగా రాజన్న ధర్మగుండానికి నీళ్లు వస్తున్నాయి. ఇకనుంచి ధర్మగుండంలో ఏడాది పొడవునా నీరు ఉండేలా చూస్తామని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment