vemulavada rajanna temple
-
వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
-
రాజన్న పుష్కరిణికి గోదారమ్మ నీళ్లు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మ పుష్కరిణిలోకి గోదారమ్మ నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో భక్తులు సంబరపడిపోతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యస్నానాలు చేస్తూ రాజన్న దర్శనం కోసం వెళుతున్నారు. మిడ్ మానే రు నుంచి పైప్‌లైన్ ద్వారా రాజన్న ధర్మగుండంలోకి గోదా వరి నీళ్లు వచ్చి చేరుతుండటంతో భక్తులకు నీళ్ల తిప్పలు తప్పాయంటూ అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ధర్మగుండాని నీటి కొరత ఉండేది. ఇటీవల కాలంలో ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయడంతో మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా నేరుగా రాజన్న ధర్మగుండానికి నీళ్లు వస్తున్నాయి. ఇకనుంచి ధర్మగుండంలో ఏడాది పొడవునా నీరు ఉండేలా చూస్తామని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. -
రాజన్న భక్తులకు ఉచిత బస్సు సేవలు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వస్తున్న భక్తు లు గుడివద్దకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు తప్పించేందుకు మంత్రి కేటీఆర్, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ ఈవో రాజేశ్వర్ యత్నిస్తున్న క్రమంలో రెండు మినీబస్సులు ఇచ్చేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి గ్రానైట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ముందుకొచ్చారు. త్వరలోనే ఈ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ అధికారులు తెలి పారు. భక్తుల కోసం మినీ బస్సులను స్వామి వారికి విరాళంగా అందించనున్నట్లు రవిచంద్ర, విజయలక్ష్మి దంపతులు ఈ నెల 13న ప్రకటించారు. -
లెక్కిస్తానని వచ్చి నొక్కేశాడు
వేములవాడ: సేవ పేరుతో రాజన్నకు ఉచిత సేవలందిస్తానని వచ్చిన చేగుంట నారాయణ అనే వ్యక్తి హుండీ లెక్కింపులో నోట్లు నొక్కేసి ఎస్పీఎఫ్ సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు చెందిన చేగుంట నారాయణను అక్కడి సత్యసాయి ట్రస్ట్ ఇన్చార్జీ వలపి బాలశేఖర్ ద్వారా హుండీ లెక్కింపులో స్వామివారి సేవ చేసేందుకు బుధవారం ఉదయం వచ్చాడు. ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ డబ్బులను చూసిన నారాయణ రూ.2 వేలనోట్లు 15, రూ.500 నోట్లు 64, ఒకటి రూ.వంద నోటు, తొమ్మిది పదిరూపాయల నోట్లు, రూ.ఇరవై నోటు ఒకదాన్ని తన నడుముకున్న లుంగీలో చుట్టేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వి.సురేందర్ దీనిపై కన్నేశాడు. కాసేపటి తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళతానంటూ నారాయణ మెల్లగా నడవసాగాడు. గమనించిన సురేందర్‌కు అనుమానం పెరిగి, నారాయణను ప్రశ్నించి, పక్కనే గదిలోకి తీసుకెళ్లి తనిఖీ చేశాడు. దీంతో రూ. 62,210 నగదు దొరికింది. వెంటనే విషయాన్ని ఈవో దూస రాజేశ్వర్‌కు తెలిపారు. ఈవో వెంటనే టౌన్ సీఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించడంతో ఎస్సై సైదారావు, స్పెషల్‌పార్టీ పోలీసు మనోహర్ నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
-
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కరీంనగర్ : వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, రామగుండంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.