వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.