devotees rush
-
మహా శివరాత్రి.. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల
-
శ్రీశైలంలో కార్తీక శోభ..
-
జులై 29: తిరుమలలో నేటి భక్తుల రద్దీ సమాచారం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. నేరుగా స్వామి వారికి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే సర్వ దర్శనానికి ఎనిమిది గంటల టైం పడుతోంది. ఇక.. ప్రత్యేక దర్శనానికి మాత్రం 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. నిన్న(ఆదివారం, జులై 29) శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.93 కోట్లుగా తేలింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది. దీంతో అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. అలాగే.. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 17 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 73,023 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,942 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.98 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమల రద్దీ .. సర్వదర్శనానికి 10 గంటలు
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (మంగళవారం) 73,332 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,202 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.73 కోట్లుగా లెక్క తేలింది.జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల..జూలై 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున తిరుమలలో వేంకటేశ్వరస్వామిని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణ దర్శించుకున్నారు. #WATCH | Tirupati, Andhra Pradesh: Governor of Telangana and Jharkhand CP Radhakrishnan says, "...The peace will be strengthened by spirituality. Lord Venkateswara bless all of us. Whenever we visit Tirumala, it reflects the great culture of Telugu people..." https://t.co/G0GsJROkDg pic.twitter.com/x9pzow1mc8— ANI (@ANI) July 24, 2024 -
Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (సోమవారం) 71,939 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.90 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వ దర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న (ఆదివారం) 75,963 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.99 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30గంటలు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం మధ్యాహ్నానికే వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. సర్వ దర్శనానికి 30గంటలకు పైగా సమయం పడుతోంది. రెండో శనివారం కాగా, రేపు ఆదివారం కావడంతో తిరుమల కొండకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అలా బల్క్ బుకింగ్ కుదరదుతిరుమలలో ఒకే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీల నుండి బల్క్ బుకింగ్‌లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుర్తించింది. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ అలా బుకింగ్ చేసిన దర్శనాలు, వసతి గదులు రద్దు చేసింది. ఈ మేరకు మెసేజ్‌లు సైతం పంపుతోంది. ఇకపై భక్తులు దళారీలను నమ్మకుండా.. నేరుగా వసతి, శ్రీవారి దర్శనాలు బుక్ చేస్కోనేలా టెక్నాలజీ అప్ డేట్ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఆధార్ అనుసంధానంతో.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉపయోగించేందుకు కార్యచరణ చేపట్టే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. -
July 06 : తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు . నిన్న 65,775 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
గరుడ ప్రసాదం.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ నరకం (ఫొటోలు)
-
శ్రావణ శుక్రవారం.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: శ్రావణమాసం శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి దర్దీగా మారింది. ఉదయం నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు వరలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్మమ్మకు ఆలయ అర్చకులు 31 రకాల విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ ఉదయాన్నే భక్తులు రద్దీని పరిశీలించారు. కాగా దుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 8న ఉచితంగా సామూమిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మావారికి పోటెత్తిన భక్తులు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో అమ్మవారు ఆలయాలు భక్తులతో కిటకిటలాడున్నాయి. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో తరిస్తున్నారు. హంటర్ రోడ్‌లోని సంతోషిమాత ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో అమ్మవారు ఆలయాలు భక్తజనసంద్రంగా మారాయి. -
Vijayawada : ఇంద్రకీలాద్రిపై శ్రావణమాస శోభ (ఫొటోలు
-
బెజవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
సాధారణ భక్తులకు ప్రాధాన్యత.. టీటీడీ ప్రయోగం సక్సెస్
సాక్షి, తిరుమల: సాధారణ కేటగిరీ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేసిన ప్రయోగం సఫలమైంది. వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం సాటించడంతో అత్యధిక భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రోజు రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారాంతం కావడం, ఆదివారంతో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలలో కిలోమీటర్లమేర భక్తులు క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. గత నాలుగేళ్లలో నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తలే అత్యధికం కావడం విశేషం. ఆదివారం రోజు శ్రీవారిని 92,238 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్ ద్వారానే 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్ మార్పులపై ఈవో ధర్మారెడ్డి నిరంతరం పర్యవేక్షించారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 40,400 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వచ్చింది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 3 కిలోమీటర్ల మేర బారులు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్మెంట్లు,షెడ్లు కిక్కిరిపోయి.. దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. చదవండి: టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రి సిద్దా రాఘవులు, ఎంపీ కోటగిరి శ్రీధర్, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ టీ.ఏ. శరవణ, తెలంగాణ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 18 నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 60,157 మంది స్వామిని దర్శించుకోగా, 31,445 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి భక్తులు కానుకల రూపంలో హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. -
శ్రీవారి దర్శనానికి 40 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఎస్ఎంసీ సర్కిల్ వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 57,104 మంది స్వామి వారిని దర్శించుకోగా, 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.4.66 కోట్లు భక్తులు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 40 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. -
యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, ప్రసాదం కౌంటర్, క్యూలైన్లు, ఘాట్ రోడ్డు.. ఇలా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మదర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. రూ.150 టికెట్ దర్శనం క్యూలైన్ సరిగ్గా లేకపోవడంతో భక్తులు అష్టభుజి ప్రాకార మండపంలో బారులు దీరారు. టికెట్ కొనుగోలు కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. స్వామి వారిని 22,776 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ విభాగాల నుంచి నిత్యాదాయం రూ.40,29,719 వచ్చినట్లు వెల్లడించారు. భక్తులు భారీగా తరలిరావడంతో రింగ్‌రోడ్డు, కొండపైన ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొండపైన పార్కింగ్ స్థలం కిక్కిరిసిపోవడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొండ కింద ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్ నిండి క్యూ లైన్ రాంభగీచ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 80,741 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.22 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు బ్రహ్మోత్సవాలకు అందుబాటులో 1,189 మంది క్షురకులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించనున్న భక్తులకు సత్వర సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఆలస్యం లేకుండా 1,189 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేసింది. వీరిలో 214 మంది మహిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించనుండటంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. ప్రధాన కల్యాణకట్టతోపాటు, పీఏసీ–1, పీఏసీ–2, పీఏసీ–3, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద గల మినీ కల్యాణకట్టలు కూడా 24 గంటలు పని చేస్తున్నాయి. జీఎన్సీ, నందకం విశ్రాంతి గృహం, హెచ్వీసీ, కౌస్తుభం, సప్తగిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో రెగ్యులర్ క్షురకులు 337 మంది, పీస్ రేటు క్షురకులు మరో 852 మంది 3 షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్ అందజేస్తారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ రాంభగీచ వరకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,292 మంది శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 30,641 మంది తలనీలాలు ఇచ్చారు. భక్తులు శ్రీవారి హుండీలో రూ.3.72 కోట్లు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి తిరుమల శ్రీవారిని శనివారం తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలివ్వగా.. టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వీరికి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్మెంట్ల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 92,328 మంది స్వామిని దర్శించుకున్నారు. 52,969 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.36 కోట్లు వేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి క్యూలైన్ ఆస్థాన మండపం వద్దకు చేరుకుంది. అద్దె గదులు దొరకకపోవడంతో భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు. -
తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,478 మంది స్వామివారిని దర్శించుకోగా, 48,692 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.53 కోట్లు వేశారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది.. క్యూలైను ఆస్థాన మండపం వద్దకు చేరింది. నేడు టీటీడీ పాలకమండలి సమావేశం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో సోమవారం పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరగనున్న ఈ సమావేశానికి పాలకమండలి సభ్యులు హాజరు కానున్నారు. ఇందులో టీటీడీ ఉద్యోగులకు ప్రమాదాలపై భద్రత కల్పించడం, వారందరికీ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందేలా ఏర్పాటు చేయడం, శ్రీవారి భక్తుల కోసం టైం స్లాట్ టికెట్లు మంజూరు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది. -
శ్రీశైలం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతంలో శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 33 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామి వారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు 12 గంటల్లోపు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు అందజేస్తున్నారు. క్యూలో ఎలాంటి తోపులాట జరుగకుండా విజిలెన్స్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచనలు చేస్తున్నారు. శనివారం 83,739 మంది శ్రీవారిని దర్శించుకోగా, స్వామి వారికి 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం హుండీ కానుకలు రూ.4.2 కోట్లు వచ్చింది. -
తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
-
భక్తుల రద్దీతో టీటీడీ కీలక నిర్ణయం
-
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
-
యాదాద్రి.. పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. లాక్డౌన్ అనంతరం దర్శనాలకు ప్రభుత్వం అనుమతించడంతో క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర నెలల తరువాత యాదాద్రి కొండపై భక్తుల సందడి నెలకొంది. ఆదివారం ఆరు వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా స్వామి వారి దర్శనానికి వచ్చిన చాలామంది భక్తులు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహించడంతో పాటు భౌతిక దూరం సైతం పాటించలేదు. ప్రసాదాల కొనుగోలు వద్ద, ఆలయ పరిసరాల్లో భక్తులు గుంపులు గుంపులుగా కనిపించారు. -
తిరుమల కిటకిట
తిరుమల/తిరుపతి తుడా: ఇల వైకుంఠం.. తిరుమల క్షేత్రానికి వేసవి సెలవులతో భక్తులు పోటెత్తుతున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల కొండ నిత్యం కిటకిటలాడుతోంది. ఈనెల 11 నుండి 15వ తేదీ వరకు రికార్డు స్థాయిలో దాదాపు 4.39 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నిర్ణీత సమయంలో స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల ఇన్చార్జ్ జేఈవో బి.లక్ష్మీకాంతం పర్యవేక్షణలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సమన్వయంతో పనిచేసి ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో గత ఐదు రోజుల్లో 4,38,514 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. 11వ తేదీ శనివారం 95,016, 12వ తేదీ ఆదివారం 1,01,086, 13వ తేదీ సోమవారం 87,947, 14వ తేదీ మంగళవారం 80,156, 15వ తేదీ బుధవారం 74,309 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సరాసరిన ప్రతి రోజు 87,702 మంది దేవదేవుడి దర్శనభాగ్యాన్ని పొందారు. తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాదాలు, వసతి, తలనీలాల సమర్పణ, దర్శనం, లడ్డూ ప్రసాదాలు తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆయా విభాగాలు విశేషంగా కృషి చేశాయి. రవాణా విభాగం ఆధ్వర్యంలో ధర్మరథాలు నిరంతరం తిరుగుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా చూసింది. సమన్వయంతో సేవలు: జేఈఓ వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి ఉద్యానవనాల్లో క్యూల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సేవలందించాయని జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు శ్రీవారి ఆలయ అధికారులు, సిబ్బంది క్యూలను క్రమబద్ధీకరించారన్నారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో ఆదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాల్లో గదుల వివరాలను ఎప్పటికప్పుడు టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియచేస్తున్నామని చెప్పారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు, వైకుంఠం – 1, 2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేసినట్లు జేఈఓ తెలిపారు. శ్రీవారి సేవకులు క్యూల నిర్వహణ, లడ్డూ ప్రసాదాల పంపిణీ, పరకామణి తదితర విభాగాల్లో సేవలందిస్తున్నారన్నారు. యాత్రికుల సంక్షేమ సౌకర్యాల సేవకులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి సత్వరం పరిష్కారమయ్యేలా సేవలందించారని తెలిపారు. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారన్నారు. తిరుమలలో రేపు పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. తలనీలాల వేలం ద్వారా రూ.1.25 కోట్ల ఆదాయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల ఈ–వేలం ద్వారా టీటీడీకి రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరింది. టీటీడీ గురువారం నిర్వహించిన ఈ–వేలంలో మొత్తం 600 కిలోల తలనీలాలను విక్రయించింది. మొదటి రకం (31 ఇంచుల పైన) తలనీలాలు కిలో రూ.22,502 ధరతో 2,500 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. రెండో రకం (16 నుండి 30 ఇంచులు) తలనీలాలు కిలో రూ.17,260 ధరతో 27,600 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.34.52 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కొనసాగుతున్న రద్దీ తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు బుధవారం శ్రీవారి హుండీకి సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ.4.10 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. రేపు పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగిసినా కొండపై భక్తుల రద్దీ తగ్గలేదు. దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లన్నీ నిండి వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 13 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో స్వామి దర్శనం చేసుకోకుండానే పలువురు భక్తులు వెనుతిరుగుతున్నారు. మరోవైపు వసతి సదుపాయాలు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
వేసవి సెలవులు: టీటీడీ అలర్ట్
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ నెల 15 నుంచి జులై 16 వరకు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండే క్రమంలో వారాంతంలో సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాలలో ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా భక్తులు అధికంగా ఉండే క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం, ఉచిత వసతిగృహాల వద్ద ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. దర్శన ప్రవేశ మార్గాల్లో టీటీడీ విజిలెన్స్‌తో పాటు, పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు సిద్దంగా ఉంచుతామన్నారు. శ్రీవారి పోటులో నిత్యం 3 లక్షల 50 వేల లడ్డూల తయారీచేస్తున్నట్టు తెలిపారు. వారానికి 127 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కాగా, అలిపిరి నుంచి మోకాళ్ల మెట్ల వరకు మరో రోడ్డు వేయడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎల్అండ్టీ కంపెనీతో సర్వే చేయిస్తోంది. -
బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన బాసరకు భక్తులు పోటెత్తారు. సోమవారం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. చిన్నారులకు అధిక సంఖ్యలో అక్షరాభాస్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. -
నాలుగు రోజులు.. మొక్కుల పరవళ్లు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం.. ఓ అద్భుతం.. సమ్మక్క–సారలమ్మ జాతర పేరుకే నాలుగు రోజుల పండుగ.. కానీ, ఈ మహా ఘట్టం నడక మాత్రం దాదాపు నెల రోజులకుపైగా సాగింది. జనవరి నెలలో సంక్రాంతి సెలవులతో ఊపందుకున్న భక్తుల రాకపోకలు తల్లుల వన ప్రవేశం ముగిసినా.. ఇంకా కొనసాగుతోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మహా జాతర ఎంతో కనుల పండువగా సాగింది. సంక్రాంతి పండుగ తర్వాత రోజుకు లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు జాతరకు ముందస్తుగా తరలివచ్చి మొక్కులు చెల్లించారు. గుడిమెలిగె, మండమెలిగె పండుగతో ప్రారంభమైన జాతర సమ్మక్క–సారలమ్మలు గద్దెలపైకి వచ్చేంత వరకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి తరలివచ్చారు. ఆనాటి నుంచి జాతర నాలుగు రోజుల్లో కోటి మంది భక్తులు తరలివచ్చి దేవతలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 31న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనంతో భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 1న వరాల తల్లి సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరడంతో భక్తులతో మేడారం పోటెత్తింది. 2న సర్వత్ర మొక్కులు చెల్లించి మనసార అమ్మలను దర్శించుకున్నారు. 3న సమ్మక్క చిలకలగుట్టకు, సారలమ్మ కన్నెపెల్లికి వనమెళ్లగా, పగిడిద్దరాజు, గోవిందరాజులు స్వస్థలాలకు వెళ్లారు. అయినప్పటికీ ఆదివారం రోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన మొక్కులు చెల్లించారు. ఇబ్బందు పడిన భక్తులు... జాతర ప్రారంభానికి ముందుగా భక్తులకు అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లు భక్తుల రద్దీ పెరగడంతో కులాయి వద్ద నీళ్లు లేకపోవడంతో భక్తులు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడ్డారు. జాతరకు వారం రోజుల ముందే మేడారానికి తరలిచ్చిన భక్తులకు తాగునీటి సమస్య వెంటాడింది. అధికారులు మేల్గొనప్పటికీ అంతంతా మాత్రంగానే తాగునీటిని సరఫరా చేశారు. రెడ్డిగూడెం రోడ్లన్నీ కూడా బురదగా మారడంతో రోడ్లపై నడిచేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి బుధ, ఆదివారాల్లో సైతం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి విడిది చేసి అమ్మలకు మొక్కులు చెల్లించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. సెలవు రోజుల వచ్చిదంటే ఆ రోజు మేడారం అంత భక్తులతో కిటకిటలాడుతోంది. మాయమైన మహా నగరం... తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులతో కుగ్రామంగా ఉన్న మేడారం మహా నగరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ప్రాంతంలో గుడారులు వేసుకుని అమ్మల రాక కోసం ఎదురుచూశారు. గద్దెలపై కొలువుదీరిన వనదేవతలకు మొక్కులు చెల్లించారు. దేవతల వనప్రవేశంతోనే భక్తులు సైతం తమ గ్రామాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో మహా నగరం ఒక్కసారి గా మాయమైనట్లుగా కనిపిస్తోంది. -
రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించామని తిరుమల జేఈఓ కేఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం జేఈఓ మీడియాతో మాట్లాడారు. ఏకాదశిలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏకాదశి, వైకుంఠద్వార దర్శనానికి తమ అంచనాలకు మించి 40 వేల మంది భక్తులు అదనంగా క్యూలో వేచి ఉన్నారని తెలిపారు. క్యూలు 4 కిలోమీటర్ల మేర విస్తరించాయని, ఔటర్ రింగ్‌రోడ్డులో మరో 2 కిలోమీటర్ల క్యూ పెరిగిందని వివరించారు. సాధారణంగా తిరుమలలో ఈనెల సంవత్సరాంతపు రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల వల్ల రద్దీ రెండింతలైందని తెలిపారు. వైకుంఠ ఏకాదశిరోజు 74,012 మంది, ద్వాదశిరోజు సాయంత్రం 7 గంటల వరకు 75,658 మంది కిలిపి రెండు రోజుల్లో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. మరికొన్ని గంటలో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుందని, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో రికార్డు స్థాయిలో 20 వేల మందికి అదనంగా దర్శనం చేయిం చామని వెల్లడించారు. భక్తుల రద్దీకి తగ్గట్టు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విశేషంగా సేవలందించారని జేఈఓ కొనియాడారు. బయటి క్యూలను క్రమబద్ధీకరించేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, ఇతర పోలీసు సిబ్బంది బాగా కష్టపడ్డారని వారిని అభినందించారు. నూతన ఆంగ్ల సంవత్సరం ఏర్పాట్లపై మాట్లాడుతూ జనవరి 1న ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవన్నారు. జనవరి 1న సోమవారం వేకువజామున 2 గంటలకు ధనుర్మాస కైంకర్యాలు, తిరుప్పావై అనంతరం 2.30 నుంచి 5.30 గంటలకు వరకు సర్వదర్శనం ఉంటుం దని తెలిపారు. నైవేద్య విరామం అనంతరం ఉదయం 6 గంటల నుంచి పరిమిత సంఖ్యలో ప్రోటోకాల్ ప్రముఖులకు బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎలాంటి అంతరాయం లేకుండా సర్వదర్శనం కొనసాగుతుందని తెలిపారు. జనవరి 1వ తేదీ వరకు దివ్యదర్శనం టోకెన్లు, ఆర్జితసేవలు రద్దు చేసినట్టు జేఈవో తెలిపారు. -
రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
వేమలవాడ: శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అర్జిత సేవలు నిలిపివేసి భక్తులకు లఘుదర్శనాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ఉదయం సాయంత్రం రాజరాజేశ్వరీదేవికి చతుషష్ఠి ఉపాచారాలతో విశేషపూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం శ్రీమహాలక్ష్మి అమ్మవారికి షోడషోపచార పూజలు నిర్వహించనున్నారు. -
భక్తులతో కిక్కిరిసిన తిరుమల
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుమలలో జాతీయ జెండాను టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఎగురవేశారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట ఓ కిలోమీటర్ మేర భక్తులు బారులుతీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం, ప్రత్యే ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 81,347 మంది భక్తులు దర్శించుకోగా స్వామివారి హుండీకి రూ. 2.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 31 కంపార్టుమెంట్లు నిండి వెలుపల కూడా స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాలిబాటన వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,797 మంది దర్శించుకున్నారు. కాగా, శ్రీవారి జ్యేష్టాభిషేకం శుక్రవారంతో ముగియనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
సర్వ దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 24 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కాలి నడకన కొండపైకి చేరుకున్న భక్తుల దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఈ రోజే ప్రారంభమైంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) స్వామివారిని 96,113 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.54 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
వేములవాడ: శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తుల తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు ముగుస్తుండంతో పాటు పునర్వసి నక్షత్రం కావడంతో సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు లఘుదర్శన ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి ఆలయంలో కిక్కిరిసిన క్యూలైన్లు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 75,543 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: నేడు రెండోరోజు తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. 6వ తేదీ వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. కాగా శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 71,691 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీకి రూ. 1.95 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
మే6 వరకు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల: నేటి నుంచి మూడు రోజులపాటు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నిర్వహిస్తారు. నారాయణగిరివనంలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ మలయప్పస్వామి, రేపు అశ్వవాహనం, ఎల్లుండి గరుడ వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. నేటి నుంచి 6వ తేదీ వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 75,283 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 3.60 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఆలయ పూజారులు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. -
వేములవాడకు పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది తరలిరావడంతో.. అధికారులు చేసిన ఏర్పాట్లు సరిపోక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసౌకర్యాలకు తోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. క్యూలైన్లలో నిల్చున్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
గంటలోపే స్వామివారి దర్శనం: ఈవో
తిరుమల: తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను కంపార్టుమెంటు నుంచి విడుదల చేసిన తరువాత గంటలోగా దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు. వేసవిలో భక్తులు రద్దీని తట్టుకునేందుకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ పరిధిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆధీనంలోని అటవీ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దర్శనం, వివిధ పూజల నిమిత్తం భక్తులు ఆన్ లైన్ లో పొందే టికెట్లను బార్ కోడ్ విధానంలో తనిఖీ చేస్తామన్నారు. -
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారి హుండీకి రూ. 2.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) 60,449 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారి హుండీకి రూ. 2.07 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: వారాంతం కావడంతో నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. సెలవు రోజు కావడంతో శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్షరాభ్యాసాలు, పత్ర్యేక పూజలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అమ్మవారి దర్శానానికి దాదాపు 3 గంటలు సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలనిడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,332 మంది భక్తులు దర్శించుకోగా..హుండీ ఆదాయం రూ. 2 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం రెండు కంపార్టెమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. స్వామి వారిని సోమవారం 73,092 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒక కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని ఆదివారం 79,137 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ. 2.33 కోట్ల వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని శుక్రవారం 63,238 మంది భక్తులు దర్శించుకోగా స్వామివారి హుండీకి రూ. 2.05 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ: వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం స్వామివారిని దర్శించుకోవడానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 61,552 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.76 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. నేటి ఉదయం ఏడున్నర గంటలవరకు స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 63,737 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన భక్తుల సంఖ్య మంగళవారం ఉదయం స్వల్పంగా ఉంది. చలి ఎక్కువగా ఉండడంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీనివాసుని 87,477 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుంచే తిరుమలకు భక్తులు పోటెత్తారు. నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వైకుంఠం క్యూ క్లాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు నిండిపోయారు. మిగతా భక్తులను టీటీడీ సిబ్బంది ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. రాత్రి ఒంటిగంట నుంచి వేకువామున నాలుగు గంటలవరకు వీఐపీలను దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున 4:10 గంటల నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు. నేటి ఉదయం తొమ్మిది గంటలకు స్వర్థరథంపై స్వామివారిని ఊరేగిస్తారు. ద్వాదశినాడు వారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం నిర్వహిస్తారు. నేటి నుంచి రెండు రోజులపాటు స్వామివారి దివ్యదర్శనం, ప్రత్యేక దర్శనాలతో పాటు సిఫారసు లేఖలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసిన విషయం తెలిసిందే. -
తిరుమల.. దివ్య దర్శనం టోకెన్ల రద్దు
⇒ నేటి ఉదయం 9గంటల నుండి క్యూలైన్లలోకి అనుమతి ⇒ రేపు ధర్మదర్శనం మాత్రమే.. ప్రత్యేక దర్శనాలు రద్దు తిరుమల: ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మొత్తం 54 కంపార్ట్మెంట్లు సిద్దం చేశారు. అవి నిండిన తర్వాత నారాయణగిరి ఉద్యావనంలో మొత్తం 16 తాత్కాలిక కంపార్ట్మెంట్లు సిద్దం చేశారు. శనివారం ఉదయం 9 గంట్ల నుంచి భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తారు. దీనివల్ల కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీని శనివారం వేకువజాము నుంచి టీటీడీ రద్దుచేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం శ్రీవారి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవిసమేత మలయప్పస్వామి వారు స్వర్ణరథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమివ్వనున్నారు. సోమవారం ద్వాదశి సందర్భంగా వేకువజాము 4.30గంటల నుండి 5.30 గంటల మధ్య పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం నిర్వహించనున్నారు. ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలు రద్దుచేశారు. ఆదివారం ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. నిన్న (శుక్రవారం) శ్రీవారిని 62,031 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,747 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.72 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో నేటి ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 62,387 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.24 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో నేడు భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా 3 గంటల సమయం పడుతోంది. కాలినడకన చేరుకున్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. వీరు ఒక కంపార్టుమెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. జనవరి 3వ తేదీన స్వామివారిని 43,278 మంది భక్తులు దర్శించుకోగా 15,972మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీకి ఆదాయం రూ.1.10 కోట్లు వచ్చింది. -
న్యూ ఇయర్ ఎఫెక్ట్: ప్రసాదంపై రూ.20 అదనం!
తిరువనంతపురం: నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ వారాంతం కావడంతో కుటుంబసమేతంగా భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే కేరళలో మాత్రం ఆలయ అధికారులు న్యూ ఇయర్ ఎఫెక్ట్ ను బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ప్రసాదం ధరను ఏకంగా రూ.20 పెంచేసి భక్తులకు విక్రయిస్తున్నారు. నేటి ఉదయం నుంచి శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. పంబ, శరన్, గుత్తి, అయ్యప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో అయ్యప్ప ప్రసాదానికి ఉన్న డిమాండ్ తో పాటు కొత్త సంవత్సరం తొలి రోజు ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల ఆలయాలలో అయ్యప్ప ప్రసాదానికి అదనంగా మరో ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చేసేదేం లేక ఆలయ అధికారులు పెంచిన నగదు చెల్లించి ప్రసాదాన్ని కొనుగోలు చేయడం ఆలయాలకు వస్తున్న భక్తుల వంతైంది. ఇదేం విడ్డూరమని కొందరు భక్తులు అనుకుంటున్నారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ తో పాటు నూతన సంవత్సరం తొలిరోజు కావడంతో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 80,340 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయానికి రెండు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా శీఘ్రంగానే పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం మంగళవారం ఉదయం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 8గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 6 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. కాగా, స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేవలం మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: నేడు (ఆదివారం) సెలవుదినం కావడంతో చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక్ర్ర పవేశ దర్శనానికి 3 గంటల సమయం, కాలి నడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. నిన్న (శనివారం) 77,884మంది ఏడుకొండల వెంకన్నను దర్శించుకోగా 43,605మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చింది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది. గురువారం ఉదయం ఏడున్నర గంటల సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు రెండు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రెండు గంటల్లోపే పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. -
శ్రీవారి సేవలో పన్నీరు సెల్వం
తిరుపతి : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పన్నీరు సెల్వం శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలలోపు సమయం పడుతోంది. -
శైవ క్షేత్రాల్లో భక్తుల కిటకిట
-
శైవ క్షేత్రాల్లో భక్తుల కిటకిట
విజయవాడ: కార్తీకమాసం ఆఖరు సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. దీపోత్సవాలు నిర్వహించి ఈశ్వరుడిని దర్శించుకుని తరించారు. విజయవాడలోని కృష్ణానది దుర్గాఘాట్‌లో భక్తులు తెల్లవారుజామునుంచే పుణ్య స్నానాలు చేశారు. అరటి దొప్పలలో దీపారాధనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. కృష్ణాజిల్లాలోని కోడూరు మండలం సంగమేశ్వరం, మచిలీపట్నం మండలం మంగినపూడిలో తెల్లవారుజామున సముద్ర స్నానాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గుంటూరుజిల్లా బాపట్లలోని సూర్యలంక, ప్రకాశంజిల్లా చీరాల వాడరేవుల్లో భక్తులు సముద్ర స్నానాలు చేశారు. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. తిరుపతి కపిలతీర్థంలో భక్తులు బారులు తీరారు. గుంటూరుజిల్లా అమరావతి, కోటప్పకొండ, పశ్చిమగోదావరిజిల్లా భీమవరం, పాలకొల్లు, తూర్పుగోదావరిజిల్లాలోని దక్షారామం వంటి పంచారామాల్లో భక్తులు కార్తీక మాస పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. సోమవారం తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుండటంతో.. ఘాట్లకు పుష్కర శోభ సంతరించుకుంది. కరీంనగర్జిల్లా వేములవాడలో భక్తులు గుండంలో స్నానాలు చేసి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కొమురవెల్లిలలో కూడా భక్తులు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి బాసర సరస్వతి అమ్మవారిని, ధర్మపురిలో నర్సింహస్వామి ఆలయాన్ని, కాళేశ్వరంలోని ఆలయాన్ని, వరంగల్ వేయిస్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను దర్శించుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో పెద్ద ఎత్తున భక్తులు బారులుతీరారు. కీసర గుట్టపై కొలువైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిట లాడుతున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొత్త శోభను సంతరించుకుంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) 60,747 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం శ్రీవారి దర్శనార్థం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామిని 56,462 మంది దర్శించుకున్నారు. 24,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవారి ఆదాయం రూ.2.84 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 57,025 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య మంగళవారం గణనీయంగా తగ్గింది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 68,007 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. అందులో 23,966 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం హుండీ ద్వారా 3 కోట్ల రూపాయలు రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు. -
దుర్గమ్మను తాకిన పెద్ద నోట్ల ప్రభావం
-
దుర్గమ్మను తాకిన పెద్ద నోట్ల ప్రభావం
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిపై పడింది. రూ. 500, 1000 నోట్లు చెల్లుబాటు కాకపోవ డంతో దుర్గమ్మ సన్నిధికి వస్తున్న భక్తుల రద్దీ తగ్గింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఇంద్రకీలాద్రి భక్తులు లేకపోవడంతో బోసిపోయింది. అమ్మవారి దర్శనానికి గంటల కొద్ది క్యూలో నిల్చోవాల్సి వచ్చేదని ప్రస్తుతం వచ్చిన వెంటనే దర్శన భాగ్యం లభిస్తుందని కొందరు భక్తులు అంటున్నారు. -
బాసరలో పెరిగిన భక్తుల రద్దీ
బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. కార్తీక శుక్రవారం కావడంతో.. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 81,981 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీవారి దర్శనార్థం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో.. సర్వదర్శనానికి 10 గంటల సమయం, నడకదారి భక్తులకు 7 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం శ్రీనివాసుని 85,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,608 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. -
యాదాద్రిలో కార్తీక పూజలు
యాదాద్రి : కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట)కు భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక పూజలు నిర్వహించారు. ముందుగా విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు... తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం సోమవారంతో ప్రారంభం కావడం విశేషమని ఆలయ అర్చకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో భక్తులు కార్తీక పూజలు చేశారు. -
తిరుమలలో తగ్గిన సందడి
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ దాదాపు తగ్గిపోయింది. దసరా సెలవుల అనంతరం మొదటిసారిగా మంగళవారం ఉదయానికి కంపార్టుమెంట్లు బోసి పోయి కనిపించాయి. సర్వదర్శనం 2 గంటల్లో లభిస్తుండగా, కాలినడక భక్తులకు గంటలోపే దర్శన భాగ్యం లభిస్తోంది. -
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీశైలం: శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుంతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 27 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, కాలినడకన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 77,325 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తుల రద్దీతో 4 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఉదయం సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం చేసుకునేందుకు భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర, కాలినడక భక్తులకు దాదాపు 4 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడకన భక్తులకు 3 గంటలకు సమయం పడుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 2 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 24 కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, కాడినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వచ్చిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండి వెలుపలి వరకు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, నడకదారిన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కాగా, ఆదివారం స్వామివారిని 1,01,018 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.85 అని అధికారులు తెలిపారు. -
తిరుమలలో తొక్కిసలాట
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రం లోని నందకం - అన్నప్రసాద కేంద్రం ద్వారం వద్ద శుక్రవారం సాయత్రం తొక్కిసలాట చోటు చేసుకుంది. గ్యాలరీలోకి వెళ్లే మార్గంలోని ప్రధాన గేటును తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. దీంతో కాస్త తొక్కిసలాట చోటుచేసుకుని పదిమంది గాయపడ్డారు. వాస్తవానికి తిరుమలలో శుక్రవారం వైభవంగా గరుడసేవ జరుగుతుంది. గరుడసేవను తిలకించేందుకు దాదాపు 3లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. రోప్‌వేతో ఎక్కడికక్కడ భక్తులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గేట్ల నుంచి ఒక్కసారిగి భక్తులు పరుగులు తీయడంతో కొందరు గాయపడ్డారు. అనంతరం గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. టీటీడీ విచ్చలవిడిగా పాసులు జారీ చేయడమూ భక్తుల అసౌకర్యానికి కారణమని తెలుస్తోంది. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం
విజయవాడ: కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. ఇంద్ర కీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహాలక్ష్మీ రూపంలో దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. శుక్రవారం మంత్రి పల్లె రఘనాథ్ రెడ్డి, ఎంపీ మురళీ మోహన్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
బాసరలో చోరీ
బాసర: బాసరలో కొలువైన శ్రీ సరస్వతి అమ్మవారి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. సందట్లో సడేమియాలాగా.. భక్తుల రద్దీని అదునుగా చేసుకొని కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
కాణిపాకం భక్తుల రద్దీ
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ అధికమైంది. స్వామివారి దర్శనానికి భక్తులకు రెండు గంటల సమయం పట్టింది. బ్రహ్మోత్సవ వేడుకల్లో ఐదవ రోజు రాత్రి వృషభ వాహనసేవలో స్వామి వారిని దర్శించుకునేందుకు తమిళనాడు,కర్ణాటక రాష్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులందరికీ శీఘ్రదర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వంద,యాభై,పదిరూపాయల టికెట్ల క్యూలన్నీ భక్తుల రద్దీతో నిండాయి. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది. -
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
-
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
–21 రోజుల పాటూ ప్రత్యేక కార్యక్రమాలు కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. -
5నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. బ్రహ్మోత్సవాల వివరాలు...5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు పూర్ణచంద్రారావు చెప్పారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనార్థం గురువారం ఉదయం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
-
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కరీంనగర్ : వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, రామగుండంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 28 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు 8 గంటల సమయం పడుతుందని, శ్రీవేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే, కాలినడకన దర్శనానికి వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే నడకదారి వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి కావడంతో శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి, ఆస్థానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే రేపు (శుక్రవారం) ఉట్లోత్సవం జరుగనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల ముగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 12వ రోజుతో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోనూ ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లను చేసింది. సంగమం ఘాట్ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్ ఘాట్లలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలు అఖరి రోజు కావడంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు భారీసంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలో సంగమం, పద్మావతి, కృష్ణవేణి, వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరులో అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. నల్లగొండ జిల్లాలో మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ ఘాట్లలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే, కాలి నడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. -
అమరపురి.. జన ఝరి
* వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ * లక్షన్నర మంది అమరేశ్వరుని దర్శనం * నేడు అమ్మవారి తెప్పోత్సవం అమరావతి (పట్నంబజారు): అమరావతి ప్రధాన రహదారులన్నీ సోమవారం పుష్కర భక్త జనం కిటకిటతో జనసంద్రంగా మారాయి. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేక పూజలు, హోమాలు, మరోవైపు అన్నదాన శిబిరాలు, వటంటీర్ల సేవలు, పుష్కర స్నానాలు, పిండప్రదాన కార్యక్రమాలతో అమరావతిలో పుష్కర శోభ సంతరించుకొంది. పవిత్ర కృష్ణవేణికి హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. శనివారం నుంచి అమరావతిలో పెరిగిన రద్దీ కొనసాగుతూనే ఉంది. మంగళవారంతో పుష్కరాలు ముగియనున్న నేప్యథంలో సోమవారం రద్దీ బాగా పెరిగింది. అమరావతిలోని మూడు ఘాట్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకే సుమారు లక్షన్నరకు పైగా భక్తులు సాన్నాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా చేశారు. శివునికి ప్రీతిపాత్రమైన రోజు కావటంతో భక్తులు ఆలయానికి విశేషంగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అభిషేకాలు, విశేష పూజలను నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం తిరుమలతిరుపతి దేవస్థానం ఆ«ధ్వర్యంలో పలు ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పిండ ప్రదానం.. అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో స్వచ్ఛంద సంస్థలు భోజన ఏర్పాట్లును చేస్తున్నాయి. సత్యసాయి సేవాసంఘం, చోడవరం లలితా పీఠం, బ్రాహ్మణ సేవా సమితి తదితర సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. రెyŠ క్రాస్, టీటీడీ సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు భక్తులకు విశేష సేవలు అందించారు. చోడవరం శ్రీలలితా పీఠం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం యాగం, సహస్ర చండీ మంత్రోచ్ఛరణ, సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి సిబ్బంది పనితీరు, బస్సుల నిర్వహణను పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ పిండ ప్రదానాలు చేశారు. నేడు మరింత పెరిగే అవకాశం... మంగళవారం పుష్కరాల ఆఖరి రోజు కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా భక్తులు వచ్చినా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ ఒక మోస్తరుగా ఉంది. సోమవారం ఉదయం సమయానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. -
పుష్కర రూట్లలో భారీ ట్రాఫిక్ జాం
నల్లగొండ/శంషాబాద్: కృష్ణా పుష్కరాలు ముగుస్తున్న సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ఆదివారం కావడంతో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున కృష్ణా తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి, వాడపల్లి ఘాట్లలో స్నానం ఆచరించడానికి వెళ్తున్న భక్తుల రద్దీ వల్ల నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జాం అయింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద మండలంలోని పాల్మాకుల శివారులోని బెంగళూరు జాతీయ రహదారిపై పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలతో భారీ ట్రాఫిక్ జాం అయింది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం 5 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. -
హారతిగొనవే.. కృష్ణమ్మా..!
గుంటూరు : కృష్ణా పుష్కరాల ఏడో రోజైన గురువారం శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ కావడంతో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సీతానగరం ఘాట్ వద్ద చిన జీయర్‌స్వామి కష్ణానదికి హారతి ఇచ్చారు. సాయంత్రం వేళ నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీతానగరం ఘాట్ భక్తులతో కిక్కిరిసింది. శుక్రవారం లక్ష మందితో సీతానగరం పుష్కర ఘాట్‌లో చినజీయర్ స్వామి పుష్కర స్నానం ఆచరించనున్నారు. ప్రముఖుల పుణ్యస్నానాలు... రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి తోట త్రిమూర్తులు అమరావతి పుష్కర ఘాట్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ధ్యానబుద్ధ ఘాట్‌లో చినరాజప్ప దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. విజయపురిసౌత్‌లోని కృష్ణవేణి ఘాట్‌లో హైకోర్టు పోర్టుపోలియో న్యాయమూర్తి సురేష్‌కుమార్ సైతా, చిత్తూరు జిల్లా రెండో అడిషనల్ ఎస్పీ సదానంద పుష్కర స్నానాలు చేశారు. దాచేపల్లి మండలం భట్రుపాలెం పుష్కర ఘాట్‌లో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి పుష్కర స్నానాలు చేసి తన తల్లిదండ్రులతో పాటు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. అచ్చంపేట మండలం కస్తల పుష్కర ఘాట్‌లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా పుష్కర స్నానాలు చేసి తల్లిదండ్రులతో పాటు, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, తమ గురువులకు పిండప్రదానాలు నిర్వహించారు. కొల్లూరు మండలం పోతర్లంక పుష్కర ఘాట్‌లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున పుష్కర స్నానం చేసి పిండప్రదానం చేశారు. కొల్లిపర పుష్కర ఘాట్‌లో ప్రభుత్వ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి కర్పూరపు రఘురామశర్మ పుష్కర స్నానం చేశారు. తాళాయపాలెంలో జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ కుటుంబసమేతంగా పుష్కర స్నానం చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెనుమూడి పుష్కర ఘాట్ వద్ద కష్ణమ్మకు హారతి ఇచ్చే కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పాల్గొన్నారు. రద్దీకనుగుణంగా అధికారుల ఏర్పాట్లు.. జిల్లాలోని ప్రధాన ఘాట్లైన అమరావతి, సత్రశాల, తాళాయపాలెం, సీతానగరం పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ పెరగడంతో అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పులిచింతల వద్ద గేట్లు మూసివేయడంతో దిగువన ఉన్న తంగెడ, దైద, పొందుగల, సత్రశాల వంటి పుష్కర ఘాట్ల వద్ద నీటి మట్టం పెరగగా, దిగువనున్న అమరావతి, తాళాయపాలెం, వైకుంఠపురం పుష్కర ఘాట్లలో అడుగుమేర నీటి మట్టం తగ్గింది. దీంతో అమరావతిలోని ధ్యానబుద్ధ పుష్కర ఘాట్ పైన ఉన్న రెండు ఘాట్లకు నీరు పూర్తిగా తగ్గడంతో భక్తులు స్నానాలు చేసేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. సీతానగరం ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తున్న నీటినే పక్క కాలువ గుండా మళ్లీ తోడి పోస్తుండటంతో నీరు కలుషితంగా మారుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తంగెడ ఘాట్‌లో 200 మంది ముస్లింల పుష్కర స్నానం... దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్‌లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ల వద్ద సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సత్రశాల పుష్కర ఘాట్‌లో పరాశక్తి సిమెంట్స్, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సత్రాల్లో పుష్కరాలకు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మజ్జిగ పంపిణీ చేశారు. అచ్చంపేట మండలం నందులరేవు పుష్కర ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తుండగా హఠాత్తుగా కొండచిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు. పోలీసులు దాన్ని చంపడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు రేంజి ఐజీ ఎన్.సంజయ్, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారం రోజులుగా సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూము నుంచి పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. -
పున్నమి ఘాట్‌లో వీఐపీల పుష్కర స్నానాలు
-
ఆరో రోజు 12 లక్షలపైనే
- పాలమూరులో హారతిచ్చిన కలెక్టర్ సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాలకు మంగళవారం కాస్త తగ్గిన భక్తుల సంఖ్య ఆరో రోజు బుధవారం మళ్లీ పెరిగింది. 13 లక్షల మంది దాకా పుష్కర స్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 9.2లక్షల మంది కృష్ణలో స్నానాలు చేశారు. ఉదయం 8 గంటల వరకు ప్రధాన ఘాట్లలో స్వల్పంగా భక్తుల రద్దీ ఉన్నా ్తర్వాత క్రమేణా పెరిగింది. బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, సోమశిల, నది అగ్రహారం, పస్పుల, కృష్ణ, క్యాతూర్, పాతాళగంగ తదితర ఘాట్లు భక్తులతో కళకళలాడాయి. వీపనగండ్ల మండలం మంచాలకట్ట వద్ద దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదాయ పద్ధతిలో పిండప్రదానం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తదితరులు పుణ్య స్నానాలు చేశారు. గొందిమళ్ల వీఐపీ పుష్కరఘాట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ హరినాథరావు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. నీళ్లు లేకపోవడంతో జూరాల ఘాట్‌లో బుధవారం కూడా స్నానాలను నిలిపివేశారు. పలు ఘాట్లలో నీటి మట్టం తగ్గింది. శ్రీశైలం వరద జలాలతో గొందిమళ్ల, సోమశిల ఘాట్లు నీటితో కళకళలాడాయి. గొందిమళ్లలో కలెక్టర్ టి.కె.శ్రీదేవి నదీ హారతి ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో 3.5 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లకు భక్తులు భారీగా వచ్చారు. తెలుగు ప్రజల ఆత్మబంధువు వైఎస్ వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా మంచాలకట్టలో వైఎస్‌కు పిండప్రదానం కొల్లాపూర్: దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల ఆత్మ బంధువని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మం డలంలోని మంచాలకట్టలో వైఎస్‌కు ఆయన పిండ ప్రదానం చేశారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సేవాదళ్ చైర్మన్ బండారు వెంకటరమణలతో కలిసి పిండ ప్రదాన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కృష్ణా నదిలో తర్పణం వదిలాక విలేకరులతో మాట్లాడారు. పలు సం క్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో వైఎస్ ఇప్పటికీ పదిలంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శులు వి.రాజశేఖర్, మేనుగొండ రాము యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వరదారెడ్డి పాల్గొన్నారు. -
'పుష్కరాల్లో కొనసాగుతున్న భక్తుల రద్దీ'
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం 2 గంటల సమయం పడుతోంది. నిన్న (బుధవారం) 70,505 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ పేర్కొంది. -
పుష్కర ఘాట్లకు పోటెత్తున్న భక్తులు
-
'21.96 లక్షల మంది పుణ్యస్నానాలు'
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 21.96 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. పుష్కరాల సందర్భంగా డ్రోన్, సెల్‌ఫోన్ కెమెరాలతో ట్రాఫిక్, రద్దీని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి 4 లక్షల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. -
హైవేపై బారులు తీరిన వాహనాలు
విజయవాడ: విజయవాడ- హైదరాబాద్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హైవేపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోవడంతో కొత్తగా వస్తున్న వాహనాలకు స్థలం లేక రోడ్డుపైనే ఆపేయడంతో.. ట్రాఫీక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. జగ్గయ్యపేట, నందిగామ టోల్గేట్ల వద్ద తెల్లవారుజాము నుంచే వాహానాల రద్దీ విపరీతంగా ఉంది. -
సాగర్ ఘాట్‌లో భక్తుల ఇక్కట్లు
నాగార్జున సాగర్: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానమాచారించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయక పోవడంతో భక్తులతో పాటు బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేలాది మంది భక్తులు పిండ ప్రధానం కార్యక్రమం చేపట్టడానికి యత్నిస్తుండగా.. వసతుల లేమి వెక్కిరిస్తోంది. ఈ రోజు భానుడి భగభగలు ఎక్కువగా ఉండటంతో.. ఎండలోనే పిండ ప్రధానం చేస్తున్న పలువురు భక్తులు సొమ్మసిల్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు. రూ.50 గదులు - ఖాళీ లేవు. రూ.100 గదులు - ఖాళీ లేవు. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - ఖాళీ లేవు. సహస్ర దీపాలంకరణ సేవ - 100 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - ఖాళీ లేవు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు - ఖాళీ లేవు. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - 70 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - 100 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - ఖాళీ లేవు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి నాలుగు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - 50 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు - 400 ఖాళీగా ఉన్నాయి. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - 100 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - 200 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సం - 120 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట లోపు సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు - ఖాళీ లేవు. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - 70 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - 100 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సం - ఖాళీ లేవు. బుధవారం ప్రత్యేక సేవ సహస్రకలశాభిషేకం. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారిని దర్శించుకోవడానికి శనివారం ఉదయం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు వసంతోత్సవం - ఖాళీ లేవు -
తిరుమలలో కొనసాగుతున్నరద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి స్వామి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటలు పడుతోంది. కాలినడక భక్తులకు 6 గంటలకు దర్శనం లభిస్తోంది. -
దుర్గగుడికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్త జనం పోటెత్తారు. శుక్రవారం కావటంతో ఇంద్రకీలాద్రికి పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అధికారులు సరైన వసతులు కల్పించడంలో విఫలం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు 40 వేల మంది దర్శించుకుని ఉంటారని అంచనా. ఆలయప్రాంగణంలో పలుచోట్ల స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సర్వదర్శనానికి 12 గంటలు, కాలి నడకన వచ్చిన వారికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే రెండో వైకుంఠం కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లూ భక్తులతో నిండిపోయాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు వసంతోత్సవం - ఖాళీ లేవు. -
వెంకన్న సన్నిధికి ‘మహా’ తాకిడి
- కఠినంగా వ్యహరించిన టీటీడీ.. - ఒకరితో ఆరుమందికి మించకుండా టికెట్ల కేటాయింపు తిరుమల: వేసవి సెలవులతో శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పోటెత్తింది. మరోవైపు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడుతో తెలుగుతమ్ముళ్లు సందడి పెరిగింది. ఇందుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కూడా శ్రీవారి దర్శనానికి క్యూ కట్టారు. అయితే టీటీడీ అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చినవారికే టికెట్లు కేటాయించారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, మృణాళిని, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, అవంతి శ్రీనివాస్, చీఫ్ విప్‌కాల్వ శ్రీనివాస్, విప్ రవికుమార్, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వెంకట సృజన కృష్ణరంగారావు, కాగిత వెంకట్రావు, బొగ్గురమణమూర్తి, గన్నబాబు, బాల వీరాంజనేయులు, దూళిపాటి నరేంద్రకుమార్, ఎమ్మెల్సీలు తిప్పేస్వామి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు పదుల సంఖ్యలో నేతలు ఉన్నారు. వీరికి బస, దర్శనం వంటి సపర్యలు చేయటం టీటీడీ అధికారులకు తలకుమించిన భారమైంది. వీరి రద్దీని ముందే ఊహించిన టీటీడీ అధికారులు సిఫారసు లేఖలకు, బ్రేక్ దర్శన టికెట్లు నిలిపేశారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులు, వారిలో ఒక్కోక్కరి వెంట కేవలం ఆరు మందికి మించకుండా అనుమతించారని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తింది. వరుసగా విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరుమల వస్తున్నారు. స్వామివారి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారిన వచ్చిన భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీగా లేవు రూ.50 గదులు - ఖాళీగా లేవు రూ.100 గదులు - ఖాళీగా లేవు రూ.500 గదులు - ఖాళీగా లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేదు సహస్ర దీపాలంకరణ సేవ - ఖాళీగా లేదు వసంతోత్సవం - ఖాళీగా లేదు బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
అరసవిల్లికి పోటెత్తిన భక్త జనం
శ్రీకాకుళం: ప్రసిద్ద పుణ్యక్షేత్రం అరసవల్లిలో వైశాఖమాసం సందర్భంగా భక్తులు రద్దీ కొనసాగుతోంది. ఉచిత, రూ. 25 క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. కేశఖండనశాల, ఇంద్రపుష్కరిణి వద్ద భక్తు లు బారులు తీరారు. అక్కడే మొక్కుబ డులు చెల్లించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులు అధికంగా రావడంతో గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడంతో కొందరు భక్తులు బారికేడ్లు దాటుకొని వెళ్లడం కనిపించింది. పుష్కరిణి వద్ద సెక్యూరిటీ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు భక్తులు ఇనుప గ్రిల్స్ దాటి పుష్కరిణి మధ్యలోకి వెళ్లారు. ఇదే అదనుగా కేశఖండనశాలలో కొందరు భక్తులు క్షురకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో ఎదురుచూసిన భక్తులను అదుపు చేయడం ఆలయ సిబ్బంది, అక్కడ విధులు నిర్వహిస్తు న్న పోలీసులకు కష్టతరంగా మారింది. -
నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.39 కోట్లు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల ... కాలిబాట దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 39 లక్షలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 13 టన్నుల తలనీలాలు ఈ వేలం ద్వారా రూ.7 కోట్ల 96 లక్షల ఆదాయం లభించిందని టీటీడీ ఆధికారులు తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్నవిజయసాయిరెడ్డి
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం పలువురు రాజకీయం ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తదితరులతో కలసి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఏఈవో కె.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌సాయిరెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే, ప్రభుత్వ విప్ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి స్వామి సేవలో పాల్గొన్నారు. . -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 2 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం మొత్తం 12 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, కాలినడక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వెంకటేశ్వరుడిని 68,418 మంది భక్తులు దర్వించుకున్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అవుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - 100 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - 100 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ - అష్టదళ పాదపద్మారాధన. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. కాగా, నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి. రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్దరణ చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గదులు ఏవీ ఖాళీ లేవు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 77,619 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం : ఖాళీ లేవు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి సర్వ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 64,386 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడకన వచ్చే భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా 2 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 82,436 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.