తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో నేడు భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా 3 గంటల సమయం పడుతోంది. కాలినడకన చేరుకున్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. వీరు ఒక కంపార్టుమెంట్‌లో దర్శనం కోసం వేచి ఉన్నారు. జనవరి 3వ తేదీన స్వామివారిని 43,278 మంది భక్తులు దర్శించుకోగా 15,972మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీకి ఆదాయం రూ.1.10 కోట్లు వచ్చింది.