compartments
-
రామగుండంలో సీ అండ్ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్&వాగన్ (C&W) ట్రాక్‌పై తప్పిన ప్రమాదం. లూప్ లైన్లో నిలిచి ఉన్న మిషన్‌ను గూడ్స్ రైలు భోగీలు ఢీకొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో 8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి. యూటీ మిషన్‌ను ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్‌లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఆపరేటర్ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
‘కుక్కలకూ’ ఓ కంపార్ట్మెంట్
సాక్షి, హైదరాబాద్: రైల్వే వ్యవస్థ దశ మార్చే రైళ్లుగా పేర్కొంటున్న వందేభారత్ రైళ్లను మరింత అప్‌గ్రేడ్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తదుపరి వెర్షన్‌గా రాబోతున్న వందేభారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువుల కంపార్ట్మెంట్ను చేరుస్తుండటం విశేషం. రైలులో ప్రయాణం చేసేవారు వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. 16 కోచ్‌లతో ఉండబోయే ఈ రైలులో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది. వాటి ఇంటీరియర్, ఎక్ట్సీరియర్‌లను అధికారికంగా రైల్వే శాఖ ఇప్పటికే విడుదల చేసి ప్రజల్లో ఆసక్తి పెంచడం తెలిసిందే. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రయాణాలు చేసే వారు ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్తుంటారు. పిల్లులు, కుక్కలు సహా ఇతర పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లటం ప్రస్తుతం చాలా ఇబ్బందిగా మారింది. లగేజీ కంపార్ట్మెంట్లో వాటిని తీసుకెళ్లేందుకు కొన్ని సందర్భాల్లో అనుమతిస్తున్నా.. వాటిల్లో సరైన వ్యవస్థ ఉండటం లేదు. కొన్ని చోట్ల బుకింగ్ చేసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ప్రయాణికుల కోచ్‌లలో వాటిని తరలించాలంటే, వాటిల్లోని ఇతర ప్రయాణికుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అందరి అంగీకారం లభించటం అసాధ్యంగా ఉంటోంది. జంతు ప్రేమికుల విజ్ఞప్తితో.. ఈ నేపథ్యంలో చాలా కాలంగా జంతు ప్రేమికుల నుంచి రైల్వేకు విన్నపాలు వస్తున్నాయి. ఇంతకాలం ఆ దిశగా దృష్టి సారించని అధికారులు ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్లలో అందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. లగేజీ కంపార్ట్మెంట్ పక్కన ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జంతువులను ఉంచేందుకు ప్రత్యేకంగా ర్యాక్స్ ఉంటాయి. అక్కడ వాటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఉంటారు. ప్రయాణికుల కోచ్‌లతో ఈ కంపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉంటుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లు రూపొందుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు అందుబాటులోకి రానుంది. ఇక్కడ తొలుత పది రైళ్లు రూపొందిస్తారు. ఆ తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి రష్యాకు చెందిన కీనెట్ రైల్వే సొల్యూషన్స్ 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూరులోని కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి. -
ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి?
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఇటీవల కాలంలో రైల్వేలలో తరచుగా వినబడుతున్న మాట ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు (బోగీలు). ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రస్తుతం పలు రైళ్లకు వినియోగిస్తున్నారు. క్రమక్రమంగా అన్ని పాత కోచ్‌లను తొలగించి వాటి స్థానంలో ఈ అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అన్ని రైళ్లకు జతచేయాలనేది రైల్వే ప్రతిపాదన. సాధారణ కోచ్‌లు నీలి రంగులో ఉండేవి. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఎరుపు రంగులో ఉంటున్నాయి. ఇవి కాకుండా క్రీం, బ్రౌన్ కలర్లో కూడా కొన్ని కోచ్‌లను మనం చూస్తుంటాం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? పాత కోచ్‌లకు ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లకు తేడాలేంటి తెలుసుకుందాం. ఎక్కువ వేగం.. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తక్కువ బరువు ఉండడంతో గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటీకి ప్రస్తుతం గరిష్టంగా గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణించే విధంగా నడుపుతున్నారు. ఇవే పాత కోచ్‌లైతే కేవలం గంటకు110 కి.మీ గరిష్ట వేగంతో మాత్రమే నడిచేవి. ఎక్కువ సీటింగ్ సామర్థ్యం సాధారణ కోచ్‌ల కంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు సుమారు 1.25 మీటర్లు ఎక్కువ పొడవు కలిగి ఉండడం వలన ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటాయి. సాధారణ జనరల్ కోచ్‌లో 90 సీట్లుంటే అదే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లో 100 సీట్లు ఉంటాయి. సాధారణ స్లీపర్ కోచ్‌లో కేవలం 72సీట్లు /బెర్తులు ఉంటే అదే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 80 సీట్లు/ బెర్తులు ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే.. లింక్ హోఫ్మన్ బుష్‌కు సంక్షిప్త పదమే ఎల్‌హెచ్‌బీ. ఈ ఎల్‌హెచ్‌బీ అనేది జర్మన్ టెక్నాలజీ తయారీదారు పేరు. భారతీయ రైల్వేలో ప్రయాణికుల రైళ్లకు ఉపయోగించే కోచ్‌లను ఇటీవల కాలంలో ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో ఇండియాలోనే రైల్ కోచ్ ప్యాక్టరీ కపుర్తలా, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్‌బరేలిలలో తయారు చేస్తున్నారు. ఈ కోచ్‌లు మనదేశంలో సుమారుగా 2000 సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రారంభంలో 24 ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంది. ఈ కోచ్‌లను మొదటగా న్యూ ఢిల్లీ–లక్నో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ప్రవేశపెట్టారు. అనంతరం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మనదేశంలో కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటి తయారీని ప్రారంభించారు. మన దేశంలో మొదట తయారైన కోచ్‌లు 2005 నుంచి అందుబాటులోకి వచ్చాయి. క్రమేపీ వీటిని చెన్నైలో, రాయ్‌బరేలీలో కూడా తయారు చేస్తున్నారు. ఈకోచ్లు యాంటీ టెలిస్కోపిక్ కావడం వలన ఏదైనా ప్రమాదాలు సంభవించినపుడు ఇవి ఒక దానిపై ఒకటి పడవు. దీనికోసం ఈ కోచ్‌లలో సెంటర్ బఫర్ కప్లింగ్ సిస్టంను వాడతారు. పాత కోచ్‌లలో అయితే డ్యూయల్ బఫర్ సిస్టంను వాడేవారు. ఆధునిక వసతులు... ► ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తాయి. ► సురక్షితమైనవి, మరింత సౌకర్యవంతమైనవి ► పాత కోచ్‌లతో పోలిస్తే ఇవి తక్కువ బరువు ఉంటాయి. ► మంచి డిజైన్లతో, స్టెయిన్లెస్ స్టీల్‌తో వీటిని తయారుచేయడం వలన ఇవి తుప్పుపట్టడానికి ఆస్కారం తక్కువ ► తక్కువ నిర్వహణ ఒక మిలియన్ కిమీ తరువాత మాత్రమే అవసరమైన సిస్టంలు (రీప్లేస్మెంట్, రిమూవల్ )మార్చుతారు. ► కోచ్ లోపల ఉన్నతమైన మోడరన్ ప్యానల్స్‌ను వినియోగించి రూఫ్, ఫ్లోర్లకు ఇంటీరియర్లు అమర్చారు. నిర్వహణ సమయాలలో వీటిని సులువుగా తీసుకుని, మళ్లీ పెట్టుకోవచ్చు. వాల్తేర్ డివిజన్ పరిధిలో .. వాల్తేర్ డివిజన్ పరిధిలో విశాఖపట్నం నుంచి బయలుదేరు, విశాఖపట్నంలో నిలిచిపోయే రైళ్లు ప్రస్తుతం 37 జతల వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ సుమారు 6 జతల రైళ్లకు (15 రేక్‌లకు) పూర్తిగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను మార్చారు. మిగిలిన వాటికి కూడా అంచెలంచెలుగా మార్పు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే విశాఖ రైళ్లు ► విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–కడప–విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–నాందేడ్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నం–అమృత్సర్–విశాఖపట్నం హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ -
ట్రేడ్
‘దాలయమ్మ వద్దు. దివ్యా అని పెట్టుకుందాం. ఎవరైనా అడిగితే అసలు పేరు అదే అని నువ్వు కూడా చెప్పు’ ‘ఊ’ అన్నాను. ‘ఏమైనా మనం అదృష్టవంతులం. పిల్ల దొరికింది. పదునాలుగు లోకాలు తిరిగితే పాతాళంలో దొరికింది పిల్ల. తూర్పు ప్రాంతం అంటే పాతాళమేలే. ఏం ఉండి చచ్చింది కనుక ఇక్కడ’ మళ్లీ ‘ఊ’ అన్నాను. నా దృష్టంతా పెద్ద రింగుల అమ్మాయి మీదే ఉంది. చిన్న రింగుల అమ్మాయి నా కాళ్ల దగ్గర కూచుని ఉంది. ఇద్దరూ మాలాగే శ్రీకాకుళం రోడ్డులో రైలెక్కారు. హౌరా నుంచి వాస్కో వెళ్లే రైలంటే ఇసుకలారీ కన్నా అధ్వాన్నం. రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఎక్కడ దొరికితే అక్కడ దూరిపోతారు. ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా దూరిపోయారు బతిమిలాడుకుని. రెండు పెద్ద సూట్‌కేసులు ఉన్నాయి. ఒక మూటలో వంట గిన్నెలు ఉన్నట్టున్నాయి. పక్క కంపార్ట్మెంట్లో వీళ్లలాగే చోటు చేసుకోగలిగిన ఒక మొరటు మనిషి గంటగంటకూ వచ్చి ఈ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా లేరా చూసి వెళుతున్నాడు. పెద్దరింగుల అమ్మాయి సైడ్ బెర్త్ పక్కన నిలుచుని ఉంది. ఇందాకటి స్టేషన్లో ఎక్కిన కుర్రాడు ఆ అమ్మాయికి దగ్గరగా నిలుచున్నాడు. వాడంత దగ్గరగా నిలుచున్నా చలించడం లేదేమిటా అని చూస్తున్నాను. ‘బ్రోకరుగాడు దొంగముండా కొడుకులాగున్నాడు. ఐదు లక్షలకు టోపీ వేద్దామనుకున్నాడు. మూడున్నరకే తెగ్గొట్టడం మంచిదయ్యింది. లక్షకు మూడెకరాలొచ్చే ప్రాంతంలో మూడున్నరంటే ఎక్కువే. అదీగాక పెళ్లి ఖర్చులు మనవే. మంటపం ఖర్చు మనదే. తాళిబొట్టు, గాజులు... ఒకటేమిటి... రేపు మనింటి కోడలైతే మనాస్తి తనాస్తి కాదా. హూ. మన ప్రాంతం అమ్మాయి మన తాహతు అమ్మాయి దొరుకుతుందనుకున్నాను. నాగుపాము నెత్తిన మణైనా దొరికేలా ఉందికాని ఆడపిల్ల దొరికేలా లేదు. కులం గోత్రం కూడా వదిలేయాల్సొస్తుంది. అయితే అమ్మాయ్... నేను మాత్రం మీ పెద్ద పిన్నిలాగా ఈవైపు నుంచి తెచ్చుకుని వేషం మార్చి రూపు మార్చి కాటను చీరలకు బదులు కంచి పట్టుచీరలు కట్టి ఇంట్లో బుట్టబొమ్మలాగా కూచోబెట్టినా మరీ సంవత్సరానికి ఒకసారి తీర్థం కోసమే పుట్టింటికి పంపను.ఎన్నిసార్లయినా రావొచ్చు. ఎన్నిసార్లయినా పోవచ్చు. ఆడపిల్లనే కదా తెచ్చుకుంటున్నాం. బానిసను కాదు గదా’ రాత్రి పది దాటేసింది. మార్కాపురం కూడా దాటేసినట్టుంది. లైట్లు మందం అయ్యాయి. ఆ కుర్రాడు ఆ అమ్మాయి చెవి దగ్గరకు వాలాడు. వాలాడా? చలించదేంటా పిల్లా? ‘ఏమైనా బ్రోకరు తెలివైనోడేలే. అమ్మాయిని కూచోబెట్టి దాని అమా ్మబాబుని కూచోబెట్టి అన్నీ వైనంగా చెప్పాడు. ఇక్కడుంటే ఏముంది మట్టి బతుకు... రైకగుడ్డకి కూడా కూలిపనికి వెళ్లి గాడిద చాకిరీ చేయాలి. ఇక్కడి పిల్లోణ్ణి చేసుకుంటే పగలు బయటి కష్టం రాత్రి మంచం కష్టం తప్ప ఏమీ ఉండదు. పైగా తాగొచ్చి బాదడం ఒకటి. మన ఆడ పిల్లలు ఎందరిప్పుడు సుకంగా లేరూ? తుంగబద్ర పక్కకెళ్లి కర్నాటకలో సెటిలైన తెలుగాళ్లు అక్కడ వ్యవసాయం చేసి ఆరుసార్లు తిని మూడుసార్లు వెళ్లేంత సంపాదిచ్చారు. కార్లు బంగళాలు నౌకర్లు చాకర్లు పట్టుపరుపుల మీద పడుతుంది బతుకు. అదేమైనా దుబాయా గిబాయా బయపట్టానికి. మూడు నెలలు బెజవాడ బాష మాట్లాడటంలో ట్రైనింగ్ ఇస్తా. పోయి బెజవాడ ప్రాంతం అమ్మాయిలాగా కలిసిపోవడమే. వాళ్లు ఎదురిచ్చిన డబ్బుతో మీ అమ్మా అప్పా బాగుపడతారు. మన పక్కూరు పుల్లెంకి పుష్పలా మారి గుంటూరుకు కోడరికం వెళ్లలేదా. అప్పలమ్మ అనూషా పేరుతో నూజివీడులో చెలాయించడం లేదా. ఇది బూదిగుంపు కేంపు సంబందం. హోస్పేటకు దగ్గర. సినిమాల్లో చూపించినట్టు స్వర్గంలా ఉంటుందా చోటు. ఎర్రగా బుర్రగా ఉండబట్టి నీ పంట పదహారుసార్లు పండినట్టే పో అనంటే అప్పుడు ఒప్పుకున్నారు’‘అయినా వాళ్ల భయాలు వాళ్లకున్నాయిగా అత్తా’ అన్నాను.‘ఎందుకుండవు. కూటికి లేనోళ్లని తెచ్చి కోడలిగా కూచోబెట్టాక మన పద్ధతులు తెలిసే దాకా కసరమా.. కొసరమా? ఛీఛాలు చీత్కారాలు ఉంటాయ్. నిఘా ఉంటుంది. డబ్బుకు అమ్ముడుపోయాక అన్నీ పడాల్సిందే. మన పక్క అమ్మాయిలు కరువై ఒక్కో ఊళ్లో యాభై అరవైమంది కుర్రాళ్లు పెళ్ళిళ్లుగాక ఆడచెట్టుకైనా ఇచ్చి చేయండో అని తిరగతా ఉన్నారనిగానీ’....ఏదో కదలిక. మైగాడ్. బేరం కుదిరినట్టుంది.పెద్ద రింగుల అమ్మాయి, ఆ కుర్రాడు టాయిలెట్‌వైపు వెళుతున్నారు. కాళ్ల దగ్గర కూచున్న చిన్న రింగుల అమ్మాయి ఏమీ పట్టనట్టే చూస్తోంది. ఇదంతా నా కంట్లో పడుతుందేమిటీ.ఐదు పది నిమిషాలు కూడా కాలేదు. ఆ కుర్రాడు వేగంగా రాసుకుంటూ ఈ వైపుకు వెళ్లాడు. పెద్ద రింగుల అమ్మాయిని గంట గంటకీ వచ్చి చెక్ చేస్తున్న మనిషి టపాటపా రెండు బాదుతున్నాడు. ‘అప్పుడే మొదలెట్టావా సొంత బిజినెస్సు. దొంగముఖం దానా’ తిడుతున్నాడు. ఆ అమ్మాయి ఏం పట్టనట్టుగా వచ్చి ఇందాక నిలుచున్న చోట నిలుచుంది. కుర్రాడు డబ్బులెగ్గొట్టి వెళ్లినట్టున్నాడు.. అటే చూస్తోంది.‘ఎక్కడికెళుతున్నారు?’ అడిగాను.‘గోవా’‘ఏం చేస్తారక్కడ’‘క్లబ్బుల్లో పేకలు కలపడం, మందు పొయ్యడం, రాత్రిళ్లు ఈడు పంపినోళ్ల దగ్గర ఉండటం. మా అమ్మా బాబులకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకెళుతున్నాడు. ఇది రెండోసారి’ ఏ భావం లేకుండా చెప్పింది.‘ఎంత సంపాదిస్తావ్’‘ఎంత సంపాదించినా అదంతా నరకం. ఎంతమందొస్తారో చెప్పలేం. ఒక్కోసారి ఇద్దరుముగ్గురొచ్చి ఒకేసారి అంటారు. కొట్టేవాళ్లు.. కొరికేవాళ్లు... రాజాం పక్కన వంద గడపల ఊరు మాది. తినడానికి తిండి లేదు. అక్కడైతే టేబుల్ మీదొదిలేసిన చికెన్ ముక్కలైనా దొరుకుతాయి. ఆకలికి ఏడ్వడం కన్నా మగాడు మీద పడ్డప్పుడు ఏడ్వడం మేలుగదా’ లోగొంతుకలో జీరగా అంది.వికారంగా అనిపించింది. టాయిలెట్ వైపు వెళుతుంటే ఆ కుర్రాడు కనిపించి ఐదువందల నోటు ముందు సాచాడు.‘ఇది ఆ అమ్మాయికి ఇవ్వండి. దీని మీద నా నంబర్ ఉంది. ఇష్టమైతే బళ్లారిలో దిగిపొమ్మనండి’ అన్నాడు.బళ్లారిలో గోలగోలగా తెల్లారింది.‘తప్పించుకున్నారా ముండల్లారా... తప్పించుకున్నారా.. ఎక్కడికెళతారో చూస్తాను’ అని ఆ చెకింగు మనిషి రంకెలేస్తూ తిరుగుతున్నాడు.ఎస్కేప్ అయ్యారన్నమాట. మా మేనత్త లేచి తీరిగ్గా ఆవలించిజుట్టు ముడివేసుకుంటోంది.ఈ పిల్లలు వాడి నుంచి తప్పించుకున్నారు. మా అత్త నుంచి ఆ దాలయమ్మ తప్పించుకుంటుందా?కథ ముగిసింది.మన్నం సింధుమాధురి రాసిన ‘తూరుపు కండ’ కథ ఇది.అసమ ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్ అయ్యే మొదటి వస్తువు స్త్రీయే. స్త్రీతో ముడిపడిన వ్యాపారం శృంగార బానిసత్వానికే కాదు సాంస్కృతిక బానిసత్వంలోకి కూడా కొనసాగుతూ ఉంటుంది. నాగరీకం నేర్చిన కోస్తాంధ్ర ఉన్నత వర్గాలు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకుని ఆప్షన్స్ కోల్పోయి చతికిల పడటం తెలుస్తోంది. పూర్వం పాలఘాట్ నుంచి ఆడపిల్లలను పెళ్లి చేసుకుని తెచ్చేవారు. ఇప్పుడు తూరుపుకు వెళుతున్నారు. హింస అంటే కొట్టడం తిట్టడమే కాదు. కల్చరల్ డిస్ప్లేస్మెంట్ కూడా. ఎన్ని కథలొస్తే ఈ బాధ తెలుస్తుంది. పునః కథనం: ఖదీర్ మన్నం సింధుమాధురి -
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారి హుండీకి రూ. 2.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) 60,449 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారి హుండీకి రూ. 2.07 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 61,552 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.76 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. నేటి ఉదయం ఏడున్నర గంటలవరకు స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 63,737 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో నేటి ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 62,387 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.24 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో నేడు భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా 3 గంటల సమయం పడుతోంది. కాలినడకన చేరుకున్న భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. వీరు ఒక కంపార్టుమెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. జనవరి 3వ తేదీన స్వామివారిని 43,278 మంది భక్తులు దర్శించుకోగా 15,972మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీకి ఆదాయం రూ.1.10 కోట్లు వచ్చింది. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ తో పాటు నూతన సంవత్సరం తొలిరోజు కావడంతో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 80,340 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయానికి రెండు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా శీఘ్రంగానే పూర్తవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి సన్నిధిలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం మంగళవారం ఉదయం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 8గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 6 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. కాగా, స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేవలం మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: నేడు (ఆదివారం) సెలవుదినం కావడంతో చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక్ర్ర పవేశ దర్శనానికి 3 గంటల సమయం, కాలి నడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. నిన్న (శనివారం) 77,884మంది ఏడుకొండల వెంకన్నను దర్శించుకోగా 43,605మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చింది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
చిత్తూరు జిల్లా తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం, నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది. గురువారం ఉదయం ఏడున్నర గంటల సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు రెండు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రెండు గంటల్లోపే పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలకు తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం శ్రీవారి దర్శనార్థం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామిని 56,462 మంది దర్శించుకున్నారు. 24,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవారి ఆదాయం రూ.2.84 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 81,981 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీవారి దర్శనార్థం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో.. సర్వదర్శనానికి 10 గంటల సమయం, నడకదారి భక్తులకు 7 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సోమవారం శ్రీనివాసుని 85,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,608 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఉదయం సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం చేసుకునేందుకు భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర, కాలినడక భక్తులకు దాదాపు 4 గంటల సమయం పడుతోంది. -
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కానుకలు
ఆదివారం లెక్కింపుల్లో రూ.4.22 కోట్లు ఆదాయం 10 గంటల్లో శ్రీవారి దర్శనం తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయంలో రికార్డు స్థాయిలో రూ.4.22 కోట్లు హుండీ కానుకలు లభించాయి. ఈ సీజన్లో ఇంతపెద్ద మొత్తంలో లభించటం ఇదే మొదటిసారి. శనివారం ఆలయ హుండీలో సమర్పించిన కానుకల్ని ఆదివారం పరకామణిలో లెక్కించారు. కొందరు భక్తులు పెద్ద మొత్తాల్లో కరెన్సీనోట్లు హుండీలో సమర్పించటంతో రికార్డు స్థాయిలో కానుకలు లభించినట్టు అధికారులు తెలిపారు. తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు 6,34,847 మంది శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 28 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 10 గంటలు, కాలిబాట భక్తులకు భక్తులకు 7 గంటల సమయం తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భ క్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో.. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం అన్నీ కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 96,779 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో శనివారం తిరుమల కొండ పోటెత్తింది. శ్రీవారి దర్శనార్థం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీనివాసుని 82,625 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 12 గంటల సమయం తీసుకుంటోంది. కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం 5 గంటల్లోనూ, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.