
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉంది. గురువారం ఉదయం ఏడున్నర గంటల సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు రెండు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రెండు గంటల్లోపే పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.