
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తురు జిల్లా తిరుమలలో శ్రీవారి ఆలయానికి మంగళవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. సర్వదర్శనం, కాలినడకన వచ్చిన భక్తులకు కేవలం రెండు గంటల్లోనే దర్శనం లభిస్తోంది. రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. మరోవైపు తిరుమలలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.