
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
చిత్తూరు జిల్లా తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం, నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.