సాక్షి, తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్తీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్‌వరకు భక్తులు వేచి ఉన్నారు.
కాగా నిన్న శ్రీవారిని 69,733 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28,614 మంది భక్తులు తలనీలాలు సమర్పించినారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చింది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వున్నారు.
10న టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఈ నెల 10వ తేదీ ఉదయం 11.44 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన మొదటిగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారి గరుడ అల్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భూమన రెండోసారి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment