![శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం](/styles/webp/s3/article_images/2017/09/3/51450922877_625x300.jpg.webp?itok=BcMNDTHh)
శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో గురువారం ఉదయం శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. కాలి నడకన దారిన వచ్చే వారికి రెండు గంటల్లోనే దర్శనభాగ్యం లభిస్తోంది. మొత్తం నాలుగు కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నట్లు సమాచారం.