devotees crowd
-
TTD: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 75,125 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకంతిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది.అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’ అని కూడా అంటారు.మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు.జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. -
భక్తులతో ఆలయాలు కిటకిట
-
యాదాద్రి ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
-
శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
-
తిరుమల: భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు
-
దర్శన భాగ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వ్యయప్రయాసల కోర్చి పిల్లాపాపలతో మేడారం వస్తున్న భక్తులకు వనదేవతల దర్శనం దుర్లభంగా మారుతోంది. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, గద్దెలపై దేవతలకు మొక్కులు చెల్లించే విధానంలో స్పష్టమైన పద్ధతి లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఐపీ, అధికారుల సిఫార్సుతో వచ్చే ఇతర కుటుంబాలు, స్నేహితుల స్పెషల్ దర్శనాలతో చిక్కులు ఎక్కువవుతున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరింది. ఇలా వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించే విషయంలో దేవాదాయశాఖ అధికారులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిఫార్సులు.. భక్తుల రద్దీ ఎక్కువైతే గేట్లకు తాళం వేసి గద్దెలపైకి ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. సాధారణ భక్తులు, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు దర్శ నం కోసం అడిగితే మా దగ్గర ఏమీ లేదు. పోలీసుల దగ్గరే గేట్ల తాళాలు ఉన్నాయంటూ దేవాదాయశాఖ సిబ్బంది సమాధానమిస్తున్నారు. దీంతో దూరం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే సమయంలో వీఐపీలు, ప్రభుత్వ అధికారుల బంధువులు, వారి సన్నిహితులు వస్తే గేట్లకు ఉన్న తాళం తీస్తూ గద్దెలపైకి అనుమతిస్తున్నారు. వీరితోపాటు గద్దెలపైకి చేరుకునేందుకు అక్కడున్న ఇతర భక్తులు ప్రయత్నిస్తున్నారు. దీంతో గద్దెల గేట్ల వద్ద తీవ్రమైన తోపులాట జరుగుతోంది. సిఫార్సు చేయించుకునే వారిని గద్దెలపైకి అనుమతించి, సాధారణ భక్తులను అనుమతించకపోవడంతో వాగ్వావాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు ఒక్కసారైనా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఈ నిరాదరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తే తమ పట్ల వివక్ష చూపారంటూ నిరాశ చెందుతున్నారు. దాగుడుమూతలు మేడారంలో రద్ధీ లేని రోజుల్లో ప్రధాన ప్రవేశ మార్గం గుండా భక్తులు గద్దెలపైకి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు మొదట సమ్మక్క గద్దె మొదటి గేటు ద్వారా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించి రెండో గేటు గుండా బయటకు వస్తారు. అక్కడి నుంచి సారలమ్మ గద్దెకు మొదటి గేటు ద్వారా లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని రెండో గేటు ద్వారా బయటకు వెళ్తారు. సెల వు రోజుల్లో భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరుకోవడంతో ప్రధాన ప్రవేశ మార్గాన్ని పూర్తిగా వీఐపీలకు కేటాయిం చారు. క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు ఒకటే గేటు ద్వారా లోపలికి వెళ్లడం, బయటకు రావడం కష్టంగా మారింది. ఎప్పుడో ఒకసారి వచ్చే వీఐపీ భక్తుల కోసం సమ్మక్క గద్దెకు సంబంధించి ఒక గేటు పూర్తిగా మూసివేయడంతో భక్తులు పాట్లు పడుతున్నారు. ఇబ్బందులు గద్దెలపై భక్తులు సమర్పించిన బంగారం, కొబ్బరి నీళ్లు కలిసి గద్దెల ప్రాంగణం తడిగా మారుతోంది. మొక్కు చెల్లించే బంగారాన్ని(బెల్లం) తలపై పెట్టుకుని తడిగా ఉన్న గ్రానైట్ ఫ్లోర్పై తీవ్రమైన తోపులాట మధ్య లోపలికి బయటికి వెళ్లడం కష్టంగా మారింది. వృద్ధులు, చిన్నపిల్లలను ఎత్తుకుని గద్దెలపైకి చేరే భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆదివాసీ వలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఒకే విధానం అమలు చేయకుండా వీఐపీ, అధికారుల బంధువులకు ఓ విధానం, సాధారణ భక్తులకు ఓ విధానం అమలు చేయడంతో భక్తులను అదుపు చేయడం కçష్టంగా ఉందంటున్నారు. గద్దెలపైకి భక్తులను అనుమతించే విషయంలో జనవరి 30 వరకు కచ్చితమైన విధానం అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దూరం నుంచి వచ్చే తమకు ప్రశాంతంగా దర్శనం జరిగేలా చూడాలని కోరుతున్నారు. -
శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో గురువారం ఉదయం శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. కాలి నడకన దారిన వచ్చే వారికి రెండు గంటల్లోనే దర్శనభాగ్యం లభిస్తోంది. మొత్తం నాలుగు కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచి ఉన్నట్లు సమాచారం. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: వారంతపు రోజు శనివారం అయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. మూడు గంటల్లోనే సర్వదర్శనం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు. కాలిబాట ద్వారా వచ్చిన భక్తులకు కూడా మూడు గంటల్లోపే దర్శనం లభిస్తోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు రెండు గంటల్లోనే స్వామిని దర్శించుకుంటున్నారు.