
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ తో పాటు నూతన సంవత్సరం తొలిరోజు కావడంతో శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 80,340 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.38 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.