రామగుండంలో సీ అండ్‌ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం | Goods Train Compartments Crashed In Loop Line At Ramagundam | Sakshi
Sakshi News home page

రామగుండంలో సీ అండ్‌ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం

Published Sat, Jan 13 2024 1:17 PM | Last Updated on Sat, Jan 13 2024 1:31 PM

Goods Train Compartments Crashed In Loop Line Ramagundam - Sakshi

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్&వాగన్ (C&W) ట్రాక్‌పై తప్పిన ప్రమాదం. లూప్ లైన్‌లో నిలిచి ఉన్న మిషన్‌ను గూడ్స్ రైలు భోగీలు  ఢీకొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో  8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి.

యూటీ మిషన్‌ను ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్‌లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఆపరేటర్‌ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement