
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తింది. వరుసగా విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరుమల వస్తున్నారు. స్వామివారి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారిన వచ్చిన భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీగా లేవు
రూ.50 గదులు - ఖాళీగా లేవు
రూ.100 గదులు - ఖాళీగా లేవు
రూ.500 గదులు - ఖాళీగా లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేదు
సహస్ర దీపాలంకరణ సేవ - ఖాళీగా లేదు
వసంతోత్సవం - ఖాళీగా లేదు
బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం