
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
అలాగే కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. కాగా, నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి. రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్దరణ చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.