తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.
మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (మంగళవారం) 73,332 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,202 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.73 కోట్లుగా లెక్క తేలింది.
జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల..
జూలై 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున తిరుమలలో వేంకటేశ్వరస్వామిని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణ దర్శించుకున్నారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Governor of Telangana and Jharkhand CP Radhakrishnan says, "...The peace will be strengthened by spirituality. Lord Venkateswara bless all of us. Whenever we visit Tirumala, it reflects the great culture of Telugu people..." https://t.co/G0GsJROkDg pic.twitter.com/x9pzow1mc8
— ANI (@ANI) July 24, 2024
Comments
Please login to add a commentAdd a comment