తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. నేరుగా స్వామి వారికి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే సర్వ దర్శనానికి ఎనిమిది గంటల టైం పడుతోంది. ఇక.. ప్రత్యేక దర్శనానికి మాత్రం 2 గంటల సమయం మాత్రమే పడుతోంది.
నిన్న(ఆదివారం, జులై 29) శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.93 కోట్లుగా తేలింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది. దీంతో అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. అలాగే.. అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment