
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సర్వదర్శనానికి 12 గంటలు, కాలి నడకన వచ్చిన వారికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే రెండో వైకుంఠం కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీ లేవు
రూ.50 గదులు - ఖాళీ లేవు
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు
వసంతోత్సవం - ఖాళీ లేవు.