
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం మధ్యాహ్నానికే వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. సర్వ దర్శనానికి 30గంటలకు పైగా సమయం పడుతోంది. రెండో శనివారం కాగా, రేపు ఆదివారం కావడంతో తిరుమల కొండకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
అలా బల్క్ బుకింగ్ కుదరదు
తిరుమలలో ఒకే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీల నుండి బల్క్ బుకింగ్‌లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుర్తించింది. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అలా బుకింగ్ చేసిన దర్శనాలు, వసతి గదులు రద్దు చేసింది. ఈ మేరకు మెసేజ్‌లు సైతం పంపుతోంది.
ఇకపై భక్తులు దళారీలను నమ్మకుండా.. నేరుగా వసతి, శ్రీవారి దర్శనాలు బుక్ చేస్కోనేలా టెక్నాలజీ అప్ డేట్ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఆధార్ అనుసంధానంతో.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉపయోగించేందుకు కార్యచరణ చేపట్టే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం.