
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ ఎస్‌ఎంసీ సర్కిల్ వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 57,104 మంది స్వామి వారిని దర్శించుకోగా, 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.4.66 కోట్లు భక్తులు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 40 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.