Srivari darshan
-
శ్రీవారి దర్శనానికి 40 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఎస్ఎంసీ సర్కిల్ వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 57,104 మంది స్వామి వారిని దర్శించుకోగా, 32,351 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.4.66 కోట్లు భక్తులు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 40 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుమలలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత కూడా పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. -
శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు: టీటీడీ
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన చెన్నైకి రేవతి పద్మావతి ట్రావెల్స్‌పై కేసు నమోదైంది. రేవతి పద్మావతి ట్రావెల్స్ సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
తిరుమలలో కరోనా నిబంధనలతో శ్రీవారి దర్శనం
-
దర్శనానికి వేళాయె
-
ఏప్రిల్ 14 వరకు శ్రీవారి దర్శనం బంద్
సాక్షి, తిరుమల: ప్రాణాంతక కరోనా నేపథ్యంలో ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ పాలక మండలి ఏప్రిల్ 14 వరకు రద్దు నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతోపాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేశామని తెలిపింది. ప్రతి రోజూ తిరుపతిలో 30 వేల మంది నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని టీడీడీ పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాగే ఏప్రిల్‌లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. (చదవండి: 128 ఏళ్ల తర్వాత నిలిచిపోనున్న దర్శనం) ఇదిలాఉండగా.. అనాథలు, నిరుపేదలను ఆదుకొనేందుకు టీటీడీ ముందుకొచ్చింది. రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా టీటీడీ అందిస్తోంది. మున్సిపల్, తుడా సిబ్బంది ద్వారా వీటిని అందించే ఏర్పాటు చేసింది. ఇక ఆలయ పెద్ద జీయర్ మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆరిపోలేదు. స్వామివారి కైంకర్యాలు ఆగమ శాస్త్ర పరంగా నిత్యం కొనసాగుతున్నాయి. తిరుమల వెంకన్నకు అర్చకులు నిత్యనైవేద్యాలు అందిస్తున్నారు. శ్రీవారి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలి అన్నారు. కాగా, శ్రీవారి దర్శనాలు రద్దుచేసి నేటికి పదిరోజులు కావడంతో తిరుమల నిర్మానుష్యంగా మారింది. (చదవండి: కరోనా నియంత్రణకు టీటీడీ సహకారం) -
విశ్వపతి పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంస...
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత టి.వి.ఆర్.కే.మూర్తి ( విశ్వపతి ) రచించిన ‘శ్రీవారి దర్శన్’ పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల ప్రశంసలు లభిస్తున్నాయి. ‘శ్రీవారి దర్శన్’ వలన తమకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయన్నారు. తమ విద్యార్థులకు ఈ విశేషాలన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విశ్వపతిని ప్రశంసించారు. విశ్వపతిని ప్రశంసించిన వారిలో హార్వర్డ్ యునివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ క్లోని, కొలంబియా యునివర్సిటీకి చెందిన జాన్ స్ట్రాటన్ హాలే, యేల్ యూనివర్సిటీ అలెగ్జాండర్ కోస్కోకోవ్ , ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ మదన్ లాల్ గోయల్, కొలరాడో ప్రొఫెసర్ లోరిలియా బీరేసిం, ప్రొఫెసర్ బ్రియాన్ట్ ఎడ్విన్కి ఉన్నారు. రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నాం.. విశ్వపతి రచించిన శ్రీవారి దర్శన్ , అమృతపథం , సిన్సియర్లీ యువర్స్ పుస్తకాలను ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం వారి ప్రధాన లైబ్రరీ లోనూ , వారి ఆసియా కేంద్రం లైబ్రరీ లోనూ ఉంచుతున్నట్లు విశ్వవిద్యాలయ లైబ్రేరియన్ మిసెస్ లాండా నుంచి వర్తమానం వచ్చింది. గతంలోనూ విశ్వపతి పుస్తకాలు హార్వర్డ్ , కార్నెల్ ఆక్స్ఫర్డ్ , కేంబ్రిడ్జి , కొపెన్హెగ్లోని డెన్మార్క్ రాయల్ లైబ్రరీలోనూ ఉంచారు. విశ్వపతి శ్రీ వేంకటేశ్వర స్వామిపై రాసిన పుస్తకాలను ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్టూడెంట్స్ రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగిస్తున్నారు. తాను రాసిన పుస్తకాలను ఇంతమందికి చేరడం ఆ శ్రీనివాసుని అనుగ్రహం గా భావిస్తున్నానని విశ్వపతి పేర్కొన్నారు. -
తిరుపతివాసులకు వెంకన్న సులభ దర్శనం
సాక్షి, తిరుమల: తిరుపతివాసులకు శుభవార్త. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని స్థానికులూ సులభంగా పొందే అవకాశం కలగనుంది. టైంస్లాట్ సర్వదర్శనం విధానాన్ని తిరుపతిలోనూ ప్రారంభించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి లేదా మార్చి నుంచి తిరుమల, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదికన టైం స్లాట్ సర్వదర్శనం అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో టైం స్లాట్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుచానూరులోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి మూడోవారం లేదా మార్చి నుండి పూర్తిస్థాయిలో కౌంటర్లు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా స్థానిక ఆలయాల సందర్శనకు భక్తులు తమ ఆధార్‌కార్డు చూపించి సులభంగా టికెట్లు పొందవచ్చు. కేటాయించిన సమయాన్నిబట్టి శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇతర స్థానిక ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. 1999లో రూ.50 సుదర్శన టికెట్ల విధానం సందర్భంలో భక్తులు జిల్లాలోని స్థానిక ఆలయాలు సందర్శించేవారు. -
ఆగస్టు 10 నుంచి ఆన్లైన్లో రూ. 300 టికెట్లు
తిరుమల: శ్రీవారి దర్శనానికి రూ.300 టికెట్లను ఆగస్టు 10వ తేదీ నుంచి ఆన్లైన్, ఈ దర్శన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం (భక్తుని ఫొటో, వేలిముద్ర సేకరణ)లో మంజూరు చేయించాలని టీటీడీ నిర్ణయించింది. జే ఈవో కేఎస్.శ్రీనివాసరాజు నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో రూ.300 టికెట్లలో మార్పులపైనే ప్రధానంగా చర్చ సాగింది. రోజుకు 18 వేల టికెట్లలో 14 రోజుల ముందు 10 వేలు, ఏడు రోజుల ముందు ఐదు వేలు, ఒక రోజు ముందు మూడు వేల టికెట్ల చొప్పున ఆన్లైన్లో కేటాయించాలని నిర్ణయించారు. అది అమలు చేసిన నాటి నుంచి తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఇవ్వకూడదని నిర్ణయించారు. కాగా, తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 19 కంపార్ట్మెంట్లలో నిండి ఉన్న భక్తులకు 15 గంటలు, కాలిబాట భక్తులకు 5 గంటల తర్వాత, రూ.300 టికెట్లు పొందిన భక్తులకు గంటన్నర సమయంలోపు శ్రీవారి దర్శనం లభించనుంది. గదులు, లాకర్లు సులభంగానే లభించాయి. -
కొండనిండా జనం.
క్యూల్లో భక్తుల మధ్య తోపులాట వెంకన్న దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమల కొండపై ఆదివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం, ఆదివారం వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజులుగా భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. బస్టాండ్, గదులు, తలనీలాలు, శ్రీవారి దర్శనం.. అన్ని చోట్లా బారులు తీరిన భక్తులతో నిండిన క్యూలే దర్శనమిస్తున్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చిన వేలాది మంది భక్తులతో నారాయణగిరి ఉద్యావనం కిటకిటలాడుతోంది. క్యూల్లో జనం కిక్కిరిసిపోవడంతో పలుమార్లు తోపులాటలు జరిగాయి. వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 48,049 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు నిండి వెలుపల కిలోమీటరు వరకు క్యూలో వేచి ఉన్నారు. వీరికి 20 గంటల తర్వాత దర్శనం లభించనుంది. కాలినడక భక్తులకు 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శనం ఉదయం 11గంటలకే నిలిపివేశారు. అప్పటికే క్యూలోకి వెళ్లిన భక్తులకు 6 గంటల తర్వాత ఆలయంలోకి అనుమతించారు. ఇక రద్దీ వల్ల గదులు, లాకర్ల కోసం యథావిధిగా భక్తులు నిరీక్షించక తప్పలేదు. కల్యాణకట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు నాలుగు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. -
తిరుమల కొండ నిండింది
శ్రీవారి దర్శనానికి 30గంటలు 3కిలోమీటర్ల భక్తుల క్యూ విపరీత రద్దీ దృష్ట్యా కాలిబాట భక్తులను క్యూల్లోకి అనుమతించని టీటీడీ వర్గాలు ఆళ్వార్చెరువు వద్ద బైఠాయించిన భక్తులు తిరుమల: తిరుమల భక్తజన సంద్రమైంది. వేసవి, వారాంతపు సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వచ్చిన కాలి బాట భక్తులను క్యూల్లోకి అనుమతించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆళ్వారు చెరువు వద్ద బైఠాయిం చారు. వేకువజాము 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 41780 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లలో వేచిఉండడంతోపాటు వెలుపల మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. వీరికి 30 గంటల తర్వాత దర్శనం లభించనున్నట్లు టీటీడీ ప్రకటిం చింది. ఇప్పటికే క్యూల్లో వేచిఉన్న భక్తులకు 16గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగడంతో రూ.300టికెట్ల దర్శనం మధ్యాహ్నం 12గంటలకు నిలిపి వేశారు. గదుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. పద్మావతి, ఎంబీసీ 34, సీఆర్వో కేంద్రీయ విచారణా కార్యాలయాల్లో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కల్యాణకట్టల వద్ద తలనీలాలు సమర్పించుకునేందుకు నాలుగు గంటలకుపైగా క్యూలైన్లలో వేచిఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైను త్వరగా కదిలేలా చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో గిరిధర్ గోపాల్ ఆదేశించారు. -
8 రోజులుగా రాకపోకల్లేవు
సాక్షి, తిరుపతి : ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎనిమిది రోజులుగా నిర్మానుష్యంగా మారింది. చూసినంత దూరం ప్లాట్‌ఫారాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్క తిరుపతి ఆర్టీసీ బస్టాండే కాదు. చిత్తూరు రీజియన్‌లోని 14 ఆర్టీసీ బస్‌డిపోల పరిధిలోని 18 బస్టాండ్లలోనూ ఇదే వరస. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సహకరించి విధులకు గైర్హాజరు అవుతుండటంతో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది. ఎనిమిది రోజులుగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీనికి తోడు జిల్లాలో రహదారుల దగ్బంధం కొనసాగుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందం గా రోడ్లపైకి వచ్చి వాహనాలు ఆపేస్తున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సులను డిపోలకే పరిమితం చేసింది. చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, సత్యవేడు, పుంగనూరు, పల మనేరు వంటి పట్టణాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కేవలం ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించి ప్రజలు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తమిళనాడు, కర్ణాటక బస్సు సర్వీసులను కూడా ఆయా రాష్ట్ర సంస్థలు నిలిపేశాయి. రీజియన్‌కు రూ.11 కోట్ల నష్టం ఆర్టీసీ చిత్తూరు రీజియన్‌కు ఇప్పటి వరకు రోజుకు రూ.1.25 లక్షల చొప్పున ఎనిమిది రోజులకు రూ.11 కోట్ల వరకు నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 14 డిపోల్లో 1450 దూర ప్రాంత బస్సులు రోడ్డెక్కకపోవటంతో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపు ఇవ్వటంతో 450 బ స్సుల వరకు తిరుగుతున్నాయి. జిల్లాలో మారుమూ ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒకటి అర గ్రామీణ స ర్వీసులు, దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసు లు, హైటెక్, వోల్వో సర్వీసులు కదలడం లేదు. ఇప్ప టి వరకు అలిపిరి డిపో పరిధిలో ఒక బస్సు స్వల్పం గా దగ్ధం కాగా, సత్యవేడు డిపో పరిధిలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు రైళ్లలో వెళ్తున్నారు. దీంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ వాహనాల నిలువుదోపిడీ ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాలకు వరంగా మారింది. సామాన్య ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణా లైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనే రు, మదనపల్లి, పుంగనూరుకు సమీప గ్రామాల నుంచి రోజువారి ఉపాధి కోసం వచ్చేవారు, చిరు వ్యాపారాలు సెవెన్సీటర్లను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తిరుపతి నగరంలో సిటీ బస్సులు తిరగకపోవటంతో కొద్ది దూరానికి కూడా కనీసం రూ.50 ఇవ్వనిదే ఆటోవారు రావటం లేదు. దీంతో సామాన్యులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సెవెన్ సీటర్లే దిక్కుగా మారాయి. హైవేల పై సెవెన్సీటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్లచేస్తున్నాయి