తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య మంగళవారం గణనీయంగా తగ్గింది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
సోమవారం శ్రీవారిని 68,007 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. అందులో 23,966 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం హుండీ ద్వారా 3 కోట్ల రూపాయలు రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు.