Hundi collections
-
కిలో గోల్డ్ బిస్కెట్లు, కోట్ల నగదు.. కృష్ణుడి హుండీకి రికార్డు ఆదాయం
జైపూర్: రాజస్థాన్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. శ్రీకృష్ణుడి ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో, హుండీ ఆదాయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్ సమీపంలోని సన్వాలియా సేథ్ ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయంలో హుండీని రెండు నెలల తర్వాత లెక్కించారు. హుండీ లెక్కింపు సందర్బంగా అందులో నుంచి కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీకృష్ణుడికి చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, వెండి పిస్టల్ ప్రత్యేక వస్తువులను కూడా భక్తులు సమర్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఆలయానికి ఇప్పటివరకు వచ్చిన ఆదాయంలో ఇదే అతి పెద్ద మొత్తమని అధికారులు చెబుతున్నారు. ఇంకా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్పారు. అలాగే.. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కిస్తున్నట్టు తెలిపారు. ఆలయానికి భారీగా విరాళాలు భారీగా ఉండటంతో దశల వారీగా లెక్కిస్తున్నారు.Chittorgarh : श्री सांवलिया सेठ के भडांर से निकली 35 करोड़ की राशि, ढ़ाई किलो सोना, 64 किलो चांदी, सागवान की लकड़ी समेत 583 किलो चांदी का रथ भी आया चढ़ावे में, करीब 20 लाख की विदेश करेंसी भी मिली भंडार सेसिक्कों की गिनती अब भी जारीएक दर्जन से अधिक देशों की निकली विदेशी… pic.twitter.com/1Uy18JeewB— News India (@newsindia24x7_) December 6, 2024 -
షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. 2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు. -
తిరుమల: మే నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాలు 1.86 కోట్లు జరిగాయి. భక్తుల సౌకర్యార్థం టైమ్ స్లాట్ సర్వదర్శన విధానాన్ని పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన కొద్ది రోజులుగా స్వామివారి హుండీ ఆదాయం రోజుకు రూ.4 కోట్లుగా ఉంటుంది. రద్దీ రోజుల్లో ఈ మొత్తం రూ.5 కోట్లు దాటుతోంది. కరోనా కారణంగా తగ్గిన హుండీ ఆదాయం ఇప్పుడు భక్తుల రాకతో మళ్లీ సిరులతో కళకళలాడుతోంది. చదవండి: (CM Jagan: రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) -
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 89కోట్లు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 21.68 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ.. శ్రీవారి దర్శనం, హుండీ ఆదాయం, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు, గదుల వివరాలను వెల్లడించింది. దర్శనం : గతేడాది ఫిబ్రవరిలో 19.93 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 21.68 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం : శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఫిబ్రవరిలో రూ.83.44 కోట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో రూ.89.07 కోట్లు వచ్చింది. అన్నప్రసాదం : గతేడాది ఫిబ్రవరిలో 43.94 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 48.40 లక్షల మంది భక్తులకు అన్నదాన సేవలు అందించారు. లడ్డూలు : గతేడాది ఫిబ్రవరిలో 83.91 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో 82.38 లక్షల లడ్డూలను అందించారు. తలనీలాలు : గతేడాది ఫిబ్రవరిలో 6.70 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ ఫిబ్రవరిలో 7.77 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. గదులు : గదుల ఆక్యుపెన్సీ గతేడాది ఫిబ్రవరిలో 102 శాతం నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 103 శాతం నమోదైంది. -
జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం
ఇది సామాన్యుడు చిందించిన స్వేదం. ఆ స్వేదమే వేల కుటుంబాల జీవితాల్లో అక్షర వెలుగులు విరజిమ్మేందుకు కారణమైంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయాలకు అనుగుణంగా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ పిలుపు మేరకు ‘స్పందించు సాయమందించు’ అనే కార్యక్రమానికి ఆ స్వేదమే కొత్త ఊపిరిని అందించింది. స్పందించే హృదయముంటే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఎందరో అభాగ్యులను ఆదుకోవచ్చని నిరూపించింది. హుండీ ఉద్యమం విప్లవంలా ఎగిసి పడేందుకు ఆ స్వేదమే కారణమైంది. చేసే సాయం చిన్నదా పెద్దదా అని ఎవరూ ఆలోచించ లేదు. ఒక్క రూపాయి మొదలు... వందల రూపాయలను హుండీలో వేస్తూ నిరుపేద కుటుంబాల్లో అక్షర జ్యోతులు వెలిగించేందుకు ఎందరో గ్రామీణులు ముందుకు వచ్చారు. సేవ చేయడమే జీవన సారంగా భావించిన ఆర్డీటీ వ్యవస్థాపకుల స్ఫూర్తితో సాగుతున్న ఈ హుండీ మహాయజ్ఞం గురించి ‘సాక్షి ఫోకస్’ మీ కోసం. – అనంతపురం సప్తగిరి సర్కిల్ సేవకు ప్రతిరూపంగా నిలిచిన ఆర్డీటీ సంస్థ జిల్లాలో 1969 నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకూ జిల్లా వ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఆర్థిక వనరులను స్పెయిన్ దేశస్తులు సమకూరుస్తూ వచ్చారు. ఆ దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇక్కడి ఆర్డీటీ కార్యకలాపాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందంటే సంస్థ ఎంత పారదర్శకంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సొంతింటి కల సాకారం, వ్యవసాయం, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వఘ్నంగా సాగిపోతున్నాయంటే అక్కడి వారి సహాయ సహకారాలు ఎంత గొప్పవో ఊహించుకోవచ్చు. మేము నిజం చేశాం.. హుండీ ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో దీని గురించి ఎక్కడా ప్రచారం అనేది లేదు. గ్రామాల్లో ఆర్డీటీ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సమయంలో మాత్రమే కేవలం మాటల రూపంగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని పురస్కరించుకుని 2012, ఏప్రిల్ 9న పెద్దవడుగూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, డైరెక్టర్ సుధీంద్రరావు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఫాదర్ విగ్రహం చుట్టూ గ్రామస్తులు తమ ఇళ్లలో ఉంచుకున్న హుండీలను తీసుకువచ్చి ఉంచారు. ఇలా మొత్తం 127 హుండీలు అక్కడ ఉండడాన్ని గమనించిన మాంఛో ఫెర్రర్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. ఏమిటిది అని స్థానికులను ప్రశ్నించారు. ‘మీరు చెప్పారు.. మేము నిజం చేశాం’ అంటూ స్థానికులు సమాధానమిస్తూ.. రోజు వారి కూలి పనుల ద్వారా తాము సంపాదించిన మొత్తంలో నుంచి కొంత హుండీలో వేస్తూ వచ్చినట్లు వివరించారు. అలా ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాతి కాలంలో జిల్లా అంతటా పాకింది. జిల్లా వ్యాప్తంగా తొలిసారి రూ. 84 లక్షలు సమకూరాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి ‘ఇండియా ఫర్ ఇండియా’ అంటూ ఆ రోజున మాంఛో ఫెర్రర్ నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ హుండీ ఉద్యమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించింది. గ్రామీణుల నుంచి ఉద్యోగుల వరకూ.. ఇలా ప్రజల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై గ్రామాల్లో కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించి స్థానికులతో మాంఛో ఫెర్రర్ నేరుగా చర్చించారు. అనాథ పిల్లలను ఆదుకోవాలని జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రతిపాదించడంతో, ప్రజానిధి వినియోగంపై ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేకమైన ఖాతాలో జమా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో పొగైన మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమా చేసి, ఆ రసీదును ఆర్డీటీ కార్యాలయంలో అందజేస్తే ఆ విరాళానికి సంబంధించిన రసీదును అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లనూ చేశారు. సమాజంలో ఇది ఎంత మార్పు తెచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ కార్యాలయంలో, వ్యాపార సముదాయాల వద్ద, ఇళ్లలోనూ హుండీలు ఉంచుకునేలా చేసింది. తర్వాతి రోజుల్లో ఉద్యోగులు ప్రతి నెలా తమ వ్యక్తిగత ఖాతా నుంచి కొంత మొత్తాన్ని నేరుగా ఆర్డీటీ ప్రజానిధి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో 10,032 మంది ఉద్యోగులు భాగస్వాములయ్యారు. వీరిలో 2,518 మంది ఆర్డీటీ సంస్థలో పనిచేస్తున్నవారే ఉన్నారు. ఏటా ఉద్యోగులు తమ వ్యక్తిగత ఖాతాల్లోంచి ప్రతి నెలా రూ.9 లక్షలను అందిస్తున్నారు. సమకూరుతున్న రూ. కోట్లు 2012లో 127 హుండీలతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2013 నాటికి 43,817కు చేరుకుంది. ఈ సంఖ్య 2015 నాటికి లక్ష హుండీలకు చేరుకుంది. 2013లో హుండీల ద్వారా రూ.97,63,021 పోగయ్యాయి. 2012 నాటికి ఇది రూ. 2 కోట్లకు దాటింది. గత ఏడాది ఏకంగా రూ. 6,58,72,775 కోట్లకు చేరుకుంది. 2013–18 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమానికి రూ, 24,94,16,578 కోట్లు సమకూరాయి. గత ఐదేళ్లలో వివిధ సేవకార్యక్రమాలకు రూ.18,87,40,036 కోట్లు ఖర్చు చేశారు. 2013లో 289 మందికి పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. 2014లో 413కు మందికి సేవలను విస్తరింపజేశారు. 2015 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లోని చెంచులకు పౌష్టికాహారాన్ని అందించడం ప్రారంభించారు. ఆ ఏడాది 701మంది అనాథలను ఆదుకుంటూనే, ఐదు వేల మందికి పౌష్టికాహారాన్ని అందించారు. 2018 నాటికి 1,590 మంది అనాథలను, 5,550 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం ఆర్టీటీ నిర్వాహకులు అందిస్తున్న స్ఫూర్తిదాయక సేవాకార్యక్రమాలను చూసిన స్పెయిన్ దేశస్తుల్లో కొత్త ఆలోచనా విధానం రేకెత్తింది. దానిని వారు ఆర్డీటీ వ్యవస్థాపకులతో పంచుకున్నారు. పేదరికంతో మగ్గిపోతున్న అనంతపురం జిల్లా వాసుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలంటే కేవలం చదువు ఒక్కే మార్గమని భావించి ఆ దిశగా రూపొందించిన కార్యాచరణపై తొలుత పెద్ద ఎత్తున మల్లాగుల్లాలు పడ్డారు. చివరకు ‘మీ ప్రయత్నం మీరు చేయండి. ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో తర్వాత చూద్ధాం’ అంటూ స్పెయిన్ దేశస్తులు భరోసానివ్వడంతో హుండీ కార్యక్రమానికి ఆర్డీటీ వ్యవస్థాపకులు రూపకల్పన చేశారు. తర్వాతి రోజుల్లో ఈ కార్యక్రమం ఓ విప్లవమై ఎగిసిపడింది. మా ఇద్దరికీ మీరందరూ.. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. తమ బాధ్యత తీరిపోయిందనుకుని మురిసిపోతున్న ఆ వృద్ధ దంపతుల జీవితంలో అనుకోను పెనుదూమారం రేగింది. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధ భరించలేక కోడలు ఎటో వెళ్లిపోయింది. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న అల్లుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మనస్థాపంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. వృద్ధులపై ఆ ఇద్దరు చిన్నారుల భారం పడింది. పూరిగుడిసెలో అత్యంత దయనీయంగా బతుకీడుస్తున్న ఆ వృద్ధ దంపతులు.. చిన్నారుల పొట్ట నింపేందుకు నానా తిప్పలు పడ్డారు. సాయమందించే వారు లేక అర్ధాకలితో జీవించసాగారు. అలాంటి సమయంలోనే వారికి ఆర్డీటీ గురించి తెలిసింది. అయితే ఆర్టీటీ సంస్థ నుంచి సాయం ఎలా పొందాలో కూడా తెలియదు. చెప్పేవారూ లేరు. దీంతో తన దీనస్థితిని వివరిస్తూ ఓ కార్డు ముక్క రాసి ఆర్డీటీ చిరునామాకు పోస్టు చేశారు. స్పందించిన సంస్థ నిర్వాహకులు వెంటనే తన ప్రతినిధులను పోరుమామిళ్లకు పంపింది. వృద్ధ దంపతులను అక్కున చేర్చుకుంది. చిన్నారులను అనంతపురం నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించింది. వీరిద్ధరే కాదు.. ఆ స్కూల్లో మరో 128 మంది అనాథలను ఆర్డీటీ సంస్థ చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారులను కదిపితే.. ‘నాకు నా తమ్ముడు.. వాడికి నేను.. మా ఇద్దరికీ మీరందరూ’ అంటూ చెమర్చిన కళ్లతో అంటుంటే చూసే వారి హృదయాలు ద్రవించిపోతున్నాయి. మేము అనాథలం కాదు.. మాది కదిరి. నాన్న ఆనంద్... విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తూ మూడున్నరేళ్ల క్రితం కిడ్నీల వ్యాధితో మరణించారు. అమ్మ బాలాజీమణి మానసికరోగి. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. నాన్న మరణించిన రోజు.. మా చేతిలో చిల్లిగవ్వ లేదు. బంధువులందరూ కలిసి అంత్యక్రియలు జరిపించి వెళ్లిపోయారు. ఇంటిలో నేను, నా చెల్లి సాయిశరణ్య తప్ప ఎవరూ లేరు. దిక్కు తోచలేదు. ఆ సమయంలో ఆర్డీటీ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి మమ్మల్ని ఆదుకున్నారు. మా విషయం తెలుసుకున్న తర్వాత మమ్మల్ని సంస్థ ద్వారా చదివిస్తున్నారు. నేను హౌస్ సర్జన్‌గా పనిచేస్తున్నా.. నా చెల్లి పీజీలో జాయిన్ కావాల్సి ఉంది. ఇప్పుడు మేము అనాథలం కాదు.. మాకు ఓ మహోన్నత కుటుంబం ఉందనే భరోసాతో జీవిస్తున్నాం. – సాయికృప, హౌస్ సర్జన్, అనంతపురం ఆర్డీటీనే చదివిస్తోంది మాది యాడికి మండలం పుప్పాలగుత్తి. నాన్న గుండెపోటుతో 1998లో మరణించాడు. తల్లి అశ్వత్థమ్మ 2008లో కిడ్నీ వ్యాధితో మరణించింది. పెద్దవడుగూరుకు చెందిన మారుతీప్రసాద్ అప్పటి నుంచి సాయం చేస్తూ వచ్చారు. డిగ్రీ వరకూ ఆయనే చదివించారు. ఆర్డీటీ వారికి ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ఇండియా ఫర్ ఇండియా పథకం ద్వారా సాయం చేస్తామన్నారు. గత ఏడాది నుంచి వర్సిటీ ఫీజులు, హాస్టల్ ఫీజు వారే చెల్లించారు. ల్యాప్‌టాప్ కూడా ఇచ్చారు. ప్రతి నెలా ఖర్చుల కోసం రూ.2,500 ఇస్తున్నారు. ఆర్డీటీ సంస్థ లేకుంటే మాలాంటి వారికి బతుకు ఉండేది కాదు. – రాజశేఖర్, ఎంసీఏ విద్యార్థి, జేఎన్టీయూ, అనంతపురం పేదలూ సాయం చేయగలరు స్పందించే హృదయాన్ని కదిలిస్తే ఎదుటి వారి గుండెల్ని కదిలిస్తుందనడానికి ఈ మహత్కార్యామే నిదర్శనం. పేదలకు సాయం పొందడమే తెలుసు అని అంటారు కానీ వారు సాయం చేయగలరని ఈ హుండీ ఉద్యమం ద్వారా బహిర్గతమైంది. వారు అందించింది ఒక్క రూపాయే అయినా.. అది వేలమందికి చేయూతనందించడంలో తిరుగులేనిదిగా నిరూపితమైంది. ఓ మెరుగైన సమాజ నిర్మాణానికి కారణమైంది. – సుధీంద్రరావు, ఆర్డీటీ డైరెక్టర్ ఉప్పెనలా మారింది సాయం చేసేందుకు అవధుల్లేని సమాజాన్ని రూపొందించాం. ఇది చినుకుగా మొదలై నేడు ఉప్పెనలా మారింది. ఇది ఫాదర్ ఫెర్రర్ ఆశయం. ఈ ఆశయానికి రూపునిచ్చింది ఈ జిల్లా వాసులే. దీనిని మహావృక్షంగా భావిస్తే ఆ వృక్షానికి నీటిని అందిస్తోంది సాయం చేస్తున్న వారే. సాయం పొందుతున్న వారందరూ ఆ వృక్షం నీడలో ఉన్నవారే. – మాంఛోఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ సాయం చేసేందుకు సంప్రదించాల్సిన చిరునామా డైరెక్టర్, ఇండియా ఫర్ ఇండియా, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, బెంగుళూరు హైవే, అనంతపురం–515001, సెల్ : 98496 42334 -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య మంగళవారం గణనీయంగా తగ్గింది. మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 68,007 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. అందులో 23,966 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం హుండీ ద్వారా 3 కోట్ల రూపాయలు రాబడి వచ్చిందని అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 81,981 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.12.58 కోట్లు
అన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవునికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రూ.12.58 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరిసారిగా మంగళవారం స్వామివారి హుండీలను తెరచి లెక్కించారు. గత 25 రోజులకుగాను రూ.80.05 లక్షల ఆదాయం వచ్చింది. దీనిని కలుపుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం వచ్చిన మొత్తం హుండీ ఆదాయం రూ.12.58 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే హుండీల ఆదాయంలో సుమారు 14 శాతం పెరుగుదల నమోదైందని దేవస్థానం ఈవో కె.నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రూ.18 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశామని చెప్పారు. మంగళవారం హుండీ లెక్కింపు సందర్భంగా నగదుతోపాటు 66 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించాయి. ఒక అజ్ఞాత భక్తుడు 34.870 గ్రాముల బరువు కలిగిన బంగారు హారాన్ని హుండీలో వేశారు. దీని విలువ రూ.1,01,000 ఉంటుందని అంచనా వేశారు. దీనిని శ్రీరామనవమి సందర్భంగా రత్నగిరిపై జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో సీతమ్మవారికి అలంకరిస్తామని ఈవో తెలిపారు. ప్రతి రోజూ కూడా సీతమ్మవారికి ఈ హారాన్ని అలంకరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మల్లన్న ఆదాయం రూ.1.72 కోట్లు
శ్రీశైలం (కర్నూలు) : శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ. 1,72,79,814 కోట్లు వచ్చినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. నగదుతో పాటు 195 గ్రాముల బంగారు, 4, 200 గ్రాముల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ 189 అమెరికా డాలర్లు, 100 సింగపూర్ డాలర్లు, 32 మలేషియా రింగిట్స్, 20 బ్రిటిష్ పౌండ్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 ఖతార్ రియాల్స్ లభించాయన్నారు. ఈ మొత్తం స్వామి అమ్మవార్లకు 30 రోజులకు వచ్చిన ఆదాయంగా ఈవో పేర్కొన్నారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ. 96.85 లక్షలు
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : అన్నవరం సత్యదేవునికి హుండీల ద్వారా 28 రోజులకు రూ.96,85,428 ఆదాయం వచ్చింది. హుండీలను గురువారం లెక్కించగా నగదు రూ.91,43,247, చిల్లర నాణాలు రూ.5,42,181, బంగారం 180 గ్రాములు, వెండి 640 గ్రాములు వచ్చినట్టు దేవస్థానం చైర్మన్ ఐవీ రామ్‌కుమార్, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు తెలిపారు. అమెరికన్ డాలర్లు 238, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 140, కువైట్ దీనార్ 0.25, సింగపూర్ డాలర్లు 37, కెనడా డాలర్లు 20, ఒమెన్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ 300, మలేషియా రిమ్స్ రెండు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పౌండ్స్ 15, ఖతార్ సెంట్రల్ బ్యాంక్ రియూల్స్ రెండు లభించాయని తెలిపారు. ఆలయంలోని ప్రధాన హుండీలను గోదావరి పుష్కరాలకు ముందు జూలై 8న మరోసారి లెక్కిస్తామన్నారు. హుండీల లెక్కింపులో విశాఖపట్నానికి చెందిన 65 మంది శ్రీహరిసేవ సభ్యులతోపాటు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.