కిలో గోల్డ్‌ బిస్కెట్లు, కోట్ల నగదు.. కృష్ణుడి హుండీకి రికార్డు ఆదాయం | Rajasthan Lord Krishna Sanwaliya Seth Temple Gets Record Donations | Sakshi
Sakshi News home page

కిలో గోల్డ్‌ బిస్కెట్లు, కోట్ల నగదు.. కృష్ణుడి హుండీకి రికార్డు ఆదాయం

Published Fri, Dec 6 2024 8:15 PM | Last Updated on Fri, Dec 6 2024 8:15 PM

Rajasthan Lord Krishna Sanwaliya Seth Temple Gets Record Donations

జైపూర్‌: రాజస్థాన్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది.  శ్రీకృష్ణుడి ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో, హుండీ ఆదాయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో చిత్తోర్‌గఢ్‌ సమీపంలోని సన్వాలియా సేథ్ ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయంలో హుండీని రెండు నెలల తర్వాత లెక్కించారు. హుండీ లెక్కింపు సందర్బంగా అందులో నుంచి కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీకృష్ణుడికి చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, వెండి పిస్టల్‌ ప్రత్యేక వస్తువులను కూడా భక్తులు సమర్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఆలయానికి ఇప్పటివరకు వచ్చిన ఆదాయంలో ఇదే అతి పెద్ద మొత్తమని అధికారులు చెబుతున్నారు. ఇంకా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్పారు. అలాగే.. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కిస్తున్నట్టు తెలిపారు. ఆలయానికి భారీగా విరాళాలు భారీగా ఉండటంతో దశల వారీగా లెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement