
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాలు 1.86 కోట్లు జరిగాయి.
భక్తుల సౌకర్యార్థం టైమ్ స్లాట్ సర్వదర్శన విధానాన్ని పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన కొద్ది రోజులుగా స్వామివారి హుండీ ఆదాయం రోజుకు రూ.4 కోట్లుగా ఉంటుంది. రద్దీ రోజుల్లో ఈ మొత్తం రూ.5 కోట్లు దాటుతోంది. కరోనా కారణంగా తగ్గిన హుండీ ఆదాయం ఇప్పుడు భక్తుల రాకతో మళ్లీ సిరులతో కళకళలాడుతోంది.
చదవండి: (CM Jagan: రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష)
Comments
Please login to add a commentAdd a comment