సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 21.68 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ.. శ్రీవారి దర్శనం, హుండీ ఆదాయం, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు, గదుల వివరాలను వెల్లడించింది.
దర్శనం : గతేడాది ఫిబ్రవరిలో 19.93 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 21.68 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం : శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఫిబ్రవరిలో రూ.83.44 కోట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో రూ.89.07 కోట్లు వచ్చింది.
అన్నప్రసాదం : గతేడాది ఫిబ్రవరిలో 43.94 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 48.40 లక్షల మంది భక్తులకు అన్నదాన సేవలు అందించారు.
లడ్డూలు : గతేడాది ఫిబ్రవరిలో 83.91 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో 82.38 లక్షల లడ్డూలను అందించారు.
తలనీలాలు : గతేడాది ఫిబ్రవరిలో 6.70 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ ఫిబ్రవరిలో 7.77 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.
గదులు : గదుల ఆక్యుపెన్సీ గతేడాది ఫిబ్రవరిలో 102 శాతం నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 103 శాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment