రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
Published Fri, Aug 18 2017 12:28 PM | Last Updated on Tue, Sep 12 2017 12:25 AM
వేమలవాడ: శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అర్జిత సేవలు నిలిపివేసి భక్తులకు లఘుదర్శనాలు కల్పిస్తున్నారు.
ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ఉదయం సాయంత్రం రాజరాజేశ్వరీదేవికి చతుషష్ఠి ఉపాచారాలతో విశేషపూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం శ్రీమహాలక్ష్మి అమ్మవారికి షోడషోపచార పూజలు నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement