వేములవాడకు పోటెత్తిన భక్తులు
Published Wed, Apr 5 2017 12:37 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది తరలిరావడంతో.. అధికారులు చేసిన ఏర్పాట్లు సరిపోక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసౌకర్యాలకు తోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. క్యూలైన్లలో నిల్చున్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Advertisement