రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
Published Mon, Jan 25 2016 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లడానికి ముందు భక్తులు శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
దీంతో మూడు రోజులుగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ధర్మగుండం వద్ద స్నానాల కోసం భక్తుల మద్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో క్యూలైన్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Advertisement