ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయగా.. శనివారం సాయంత్రం బన్నీ ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించాడు. ఇదలా ఉండగానే తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ విషయంపై స్పందించారు. పౌరులు అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనతోపాటు అల్లు అర్జున్‌ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్)
'వ్యక్తిగతంగా మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యం. ఆయన సినిమా హీరో కావొచ్చు క్షేత్రస్థాయి పరిస్థితులని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదు. ప్రజలు భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు' అని డీజీపీ జితేందర్ చెప్పారు. ఫిర్యాదు మేరకు చర్యలుంటాయని పేర్కొన్నారు.
మోహన్ బాబు కేసు గురించి కూడా మాట్లాడిన ఈయన.. నటుడు మోహన్ బాబు, తన కొడుకు మధ్య ఫ్యామిలీ గొడవలున్నాయి. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసులో ప్రస్తుతం విచారణ నడుస్తోందని డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment