
చందుర్తి (వేములవాడ): ఎప్పుడో విడిపోయిన తల్లిదండ్రులను కలపడానికి ప్రయత్నించి విఫలమైన ఒక కొడుకు.. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో జరిగింది.
ఈ విషాద ఘటనపై పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆశిరెడ్డిపల్లెకు చెందిన కట్కూరి ప్రశాంత్ (23) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు నర్సయ్య, నాగవ్వ పదిహేనేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి తల్లి.. అమ్మమ్మ గ్రామం వేములవాడ మండలం హన్మాజిపేటలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది.
తల్లిదండ్రుల ఎడబాటుతో ఎంతో జీవితాన్ని కోల్పోయానని భావించిన కొడుకు ప్రశాంత్.. తల్లి వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. ఇందుకు తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment