'స్టాప్‌ చీప్‌ పాలిటిక్స్‌ ఆన్‌ అల్లు అర్జున్‌'.. సోషల్‌మీడియాలో వైరల్‌ | Stop Cheap Politics On ALLU ARJUN Hashtag Trend | Sakshi
Sakshi News home page

'స్టాప్‌ చీప్‌ పాలిటిక్స్‌ ఆన్‌ అల్లు అర్జున్‌'.. సోషల్‌మీడియాలో వైరల్‌

Dec 22 2024 8:27 PM | Updated on Dec 22 2024 8:45 PM

Stop Cheap Politics On ALLU ARJUN Hashtag Trend

హీరో అల్లు అర్జున్ ఇంటిపై  OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు రాళ్ల దాడి జరగడంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో  ట్రెండ్‌ అవుతున్నాయి. 24 గంటలుగా తెలంగాణలో అల్లు అర్జున్‌ టాపిక్‌ మాత్రమే వైరల్‌ అవుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ పోలీసులు కూడా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన సంఘటన గురించి ప్రజలకు తెలిపారు. అయితే, కొంత సమయం క్రితం అల్లు అర్జున్‌పై ఏసీపీ విష్ణుమూర్తి  ఇదే సమయంలో  తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు. 

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే తోలు తీస్తామంటూ వంటి అభ్యంతకరమైన కామెంట్లు ఆయన చేశారు. సినిమా వాళ్ల దుస్తులు ఊడతీస్తామంటూనే జూబ్లీహిల్స్ ఏరియాలో ఇంటి కోసం అంత డబ్బులు ఎక్కడివని అయన ప్రశ్నించారు. మరోవైపు అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్లతో కొందరు దాడి చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఆపై కాంగ్రెస్‌ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా అల్లు అర్జున్‌ టార్గెట్‌గా కామెంట్లు చేస్తుండటంతో సోషల్‌మీడియా అట్టుడికి పోతుంది. దీంతో అల్లు అర్జున్‌ అభిమానులు కూడా తమ వర్షన్‌ను సోషల్‌మీడియా వేదికగా తెలుపుతున్నారు. 'స్టాప్‌ చీప్‌ పాలిటిక్స్‌ ఆన్‌ అల్లు అర్జున్‌' (#StopCheapPoliticsOnALLUARJUN)అనే హ్యాష్‌ట్యాగ్‌  వైరల్‌ అవుతుంది. కేవలం ఒక గంటలోనే 2 లక్షలు పైగా ఈ హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి.

భయంతో అల్లు అర్జున్‌ పిల్లలు
అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో ఆయన మామ చంద్రశేఖర్‌ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. దాడికి సంబంధించిన వివరాలను అక్కడి సెక్యూరిటీ వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే, దాడి జరిగిన సమయంలో బన్నీ ఇంట్లో లేరని తెలుస్తోంది. దీంతో ఆయన పిల్లలు ఇద్దరూ ఆందోళన చెందడంతో వెంటనే చంద్రశేఖర్‌ రెడ్డి అక్కడకు రావడం జరిగింది. ఆపై వారిని తన ఇంటికి తీసుకెళ్లారు.

దాడిచేసిన వారిపై ఫిర్యాదు
అల్లు అర్జున్‌ ఇంటిని ముట్టడించిన వారిపై జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌లో  అల్లు అరవింద్‌ ఫర్యాదు చేశారు. దీంతో వారు అక్కడకు చేరుకుని కొందరని అదుపులోకి తీసుకున్నారు. బన్నీ ఇంటి గోడలు ఎక్కి రాళ్లు విసిరిన 8 మంది ఓయూ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడి నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement