సాక్షి, తిరుమల: సాధారణ కేటగిరీ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేసిన ప్రయోగం సఫలమైంది. వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం సాటించడంతో అత్యధిక భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రోజు రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారాంతం కావడం, ఆదివారంతో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలలో కిలోమీటర్లమేర భక్తులు క్యూ లైన్‌లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
గత నాలుగేళ్లలో నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తలే అత్యధికం కావడం విశేషం. ఆదివారం రోజు శ్రీవారిని 92,238 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్ ద్వారానే 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్ మార్పులపై ఈవో ధర్మారెడ్డి నిరంతరం పర్యవేక్షించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 40,400 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment