
తిరుమలలో భక్తుల రద్దీ (పాత చిత్రం)
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులు పోటెత్తారు.
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగిసినా కొండపై భక్తుల రద్దీ తగ్గలేదు. దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లన్నీ నిండి వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 13 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీ పెరగడంతో స్వామి దర్శనం చేసుకోకుండానే పలువురు భక్తులు వెనుతిరుగుతున్నారు. మరోవైపు వసతి సదుపాయాలు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.