
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారిని దర్శించుకోవడానికి శనివారం ఉదయం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీ లేవు
రూ.50 గదులు - ఖాళీ లేవు
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు
వసంతోత్సవం - ఖాళీ లేవు