యాదాద్రిలో కార్తీక పూజలు | devotees Special prayers in yadadri over karthika masam | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో కార్తీక పూజలు

Published Mon, Oct 31 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

devotees Special prayers in yadadri over karthika masam

యాదాద్రి : కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట)కు భక్తులు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కార్తీక పూజలు నిర్వహించారు.

ముందుగా విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు... తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకమాసం సోమవారంతో ప్రారంభం కావడం విశేషమని ఆలయ అర్చకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో భక్తులు కార్తీక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement