
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. లాక్‌డౌన్ అనంతరం దర్శనాలకు ప్రభుత్వం అనుమతించడంతో క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర నెలల తరువాత యాదాద్రి కొండపై భక్తుల సందడి నెలకొంది. ఆదివారం ఆరు వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా స్వామి వారి దర్శనానికి వచ్చిన చాలామంది భక్తులు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహించడంతో పాటు భౌతిక దూరం సైతం పాటించలేదు. ప్రసాదాల కొనుగోలు వద్ద, ఆలయ పరిసరాల్లో భక్తులు గుంపులు గుంపులుగా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment