నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి కొండపై ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనాలు ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు.
టికెట్ ఉన్న వారినే ర్యాంప్ పైనుంచి బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. కానీ, ఆలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తులు బుధవారం బ్రేక్ దర్శనం సమయంలో వచ్చారు. దీంతో అధికారి వద్ద పని చేసే సిబ్బంది వారిని నేరుగా లిఫ్టు మార్గంలో ప్రధానాలయానికి చేరుకొని, పశ్చిమ రాజగోపురం నుంచి నేరుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీనిని చూసిన భక్తులు కొందరు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ దర్శనం కొనుగోలు చేసే భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి పోలీసులు తనిఖీలు చేసిన తరువాతనే ఆలయంలోకి పంపిస్తున్నారు.
కానీ, అధికారికి తెలిసిన వారు వస్తే నేరుగా ఎగ్జిట్ నుంచి దారి నుంచి పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులను అడిగితే.. ఓ ఏఈవో అధికారికి తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఆయన దగ్గర పని చేసే సిబ్బంది పశ్చిమ గోపురం నుంచి తీసుకెళ్లారని సమాధానం ఇచ్చారు. దీనిని చూసిన ఇతర సిబ్బంది భక్తులను బ్రేక్ దర్శనం సమయంలో పశ్చిమ రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment