break darshanam
-
నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం అమలు..
-
TTD: బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో టీటీడీదే ప్రథమ స్థానం. టీటీడీ వాడుతున్న టెక్నాలజీ మరే దేవస్థానం వాడుకోలేకపోతున్నాయి. అధునాతన టెక్నాలజీ వినియోగించి శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను కల్పించాలన్న ధ్యేయంతో టీటీడీ ప్రతినిత్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానని అందిపుచ్చుకుంటుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ నుంచి.. వివిధ రకాల సేవలతో పాటుగా డొనేషన్స్ సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది టీటీడీ. ఇక నిఘా నేత్రాలకి కావాల్సిన అత్యాధునిక అనలిటిక్స్ పరిజ్ఞానం జోడించి.. తోపులాటలు సకాలంలో గుర్తించేలా సీసీటీవీ టెక్నాలజీని వినియోగిస్తుంది. సామాన్య భక్తులకు గదుల కేటాయింపు.. ఎస్ఎస్డీ టైం స్లాట్ కేటాయింపు కూడా నూతన టెక్నాలజీ వినియోగించే ముందుకు సాగుతుంది. తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు.. దర్శనం క్యూలైన్.. గదుల కేటాయింపు కౌంటర్.. ఈవో కార్యాలయం.. చైర్మన్ కార్యాలయం.. వసతి గదులకు వెళ్లాలంటే కొంత కాస్త తరమే. అడ్రెస్స్ కనుకొని వెళ్లే లోపే తిప్పలు తప్పవు. భక్తులు ఎదుర్కొంటున్న తిప్పలు తప్పించేందుకు టీటీడీ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశ పెట్టింది. తిరుమలలోని కాటేజ్ బుకింగ్ కార్యాలయాల వద్ద ఈ టెక్నాలజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన సేవలను అందించాలని టీటీడీ ప్రతి నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. భక్తులు అనేక సందర్భాలలో గదుల కేటాయింపు అనంతరం తమ గదులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే వారు. ఈ ఇబ్బందిని భక్తులు అతిక్రమించడానికి నయా ఆలోచనకు నాంది పలికింది. ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేశారు. భక్తులు బస్టాండ్‌లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్‌ను తమ మొబైల్లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. మనం వెళ్లాల్సిన ప్రాంతం పేరు క్రింద క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే మ్యాప్ డిస్ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. గతంలో సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. ఈ విధానం శ్రీవారి సేవకుల ద్వారా అమలు చేసి సత్ ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్లను ఎంబీసీ.. సీఆర్ఓ వద్ద ఏర్పాటు చేసింది. వారికి కేటాయించిన గదులకు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి నుండి ఈ విధానాన్ని అమలుచేస్తోంది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్‌ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా టీటీడీ కొత్తగా ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్ పే సిస్టమ్ చాలా బాగుంది అంటున్నారు. -
యాదాద్రిలో నిబంధనలకు తిలోదకాలు
నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి కొండపై ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనాలు ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. టికెట్ ఉన్న వారినే ర్యాంప్ పైనుంచి బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. కానీ, ఆలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తులు బుధవారం బ్రేక్ దర్శనం సమయంలో వచ్చారు. దీంతో అధికారి వద్ద పని చేసే సిబ్బంది వారిని నేరుగా లిఫ్టు మార్గంలో ప్రధానాలయానికి చేరుకొని, పశ్చిమ రాజగోపురం నుంచి నేరుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీనిని చూసిన భక్తులు కొందరు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ దర్శనం కొనుగోలు చేసే భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి పోలీసులు తనిఖీలు చేసిన తరువాతనే ఆలయంలోకి పంపిస్తున్నారు. కానీ, అధికారికి తెలిసిన వారు వస్తే నేరుగా ఎగ్జిట్ నుంచి దారి నుంచి పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులను అడిగితే.. ఓ ఏఈవో అధికారికి తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఆయన దగ్గర పని చేసే సిబ్బంది పశ్చిమ గోపురం నుంచి తీసుకెళ్లారని సమాధానం ఇచ్చారు. దీనిని చూసిన ఇతర సిబ్బంది భక్తులను బ్రేక్ దర్శనం సమయంలో పశ్చిమ రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లారు. -
టీటీడీ కీలక నిర్ణయాలు.. బ్రేక్ దర్శన సమయంలో మార్పు
-
ఇక ఆన్లైన్లో యాదాద్రి బ్రేక్ దర్శనం టికెట్లు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో బ్రేక్ దర్శనం టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆలయ ఈవో గీతారెడ్డి గురువారం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. యాదాద్రీశుడి ఆలయంలో బ్రేక్ దర్శనాలకు రూ.300 టికెట్ కొనుగోలు చేసి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. http://yadadritemple.telangana.gov.in లో లాగిన్ కావాలని ఈవో6 సూచించారు. ఈ వెబ్సైట్లో ఉఈ్చటటజ్చిnకు వెళ్లి బ్రేక్ దర్శనం రూ.300 అన్న ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్లో రుసుము చెల్లించి టికెట్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఒక టికెట్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. -
యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు ప్రారంభం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 9కి బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొండపైన రిసెప్షన్ కార్యాలయంలో ఉద యం 8.30 నుంచే భక్తులు బ్రేక్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం నుంచి ఉత్తర ప్రథమ ప్రాకార మండపంలోకి చేరుకున్నారు. 9గంటల సమయంలో భక్తులను తూర్పు త్రితల రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతిచ్చారు. బ్రేక్ దర్శనాలతో రూ.87,600 ఆదాయం సమకూరింది. 8న ఆలయం మూసివేత నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8.15 నుంచి రాత్రి 8 వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. రాత్రి 8.గంటలకు ఆలయాన్ని తీసి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారని వివరించారు. 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారన్నారు. కార్తీక పౌర్ణ మి సందర్భంగా స్వామి వారికి నిర్వహించే అన్నకూటోత్సవం లాంఛనంగా నిర్వహిస్తా మని తెలిపారు. కాగా చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేసినట్లు ఈఓ తెలిపారు. -
31 నుంచి యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు, వీఐపీ, వీవీఐపీలకు తిరుపతి తరహాలో దర్శనాలు కల్పించేలా ఆలయ అధికా రులు చర్యలు చేపట్టారు. ఈ నెల 31 నుంచి బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నట్లు ఈవో గీతారెడ్డి శనివారం వెల్లడించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికీ టికెట్ ధర రూ.300గా నిర్ణయించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మొదటి దశలో 200, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగే బ్రేక్ దర్శనాలకు 200 టికెట్లు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలు చేసి ఆయా సమయాల్లో వచ్చిన భక్తులను ఉత్తర రాజగోపురం నుంచి శ్రీస్వామి వారి దర్శనాలకు పంపించనున్నారు. ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనాల నిలుపుదల.. బ్రేక్ దర్శనాలు ఉన్న ఆయా సమయాల్లో ధర్మదర్శ నాలు, ప్రత్యేక దర్శనాలను నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు తీసుకువచ్చే భక్తులు కొండపైన రిసెప్షన్ కార్యాలయం (పీఆర్వో)లో ఇచ్చి, అక్కడే రూ.300 టికెట్ కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం వద్దకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. -
Tirumala: 24, 25, నవంబర్ 8న బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న దీపావళి ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజున బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా 23న సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు. అలాగే, 25న సూర్యగ్రహణం నాడు ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా ఆ రోజున బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో 24న సిఫార్సు లేఖలు స్వీకరించరు. నవంబర్ 8న చంద్రగ్రహణం నాడు ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా ఆ రోజున కూడా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో నవంబర్ 7న సిఫార్సు లేఖలను స్వీకరించరు. కాగా, 25, నవంబర్ 8న శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 20 కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,420 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.28 కోట్లు వేశారు. (క్లిక్: యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం) -
ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల : ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చెయ్యమని అధికారులను ఆదేశించినట్లు టీటీడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్రేక్ దర్శనాల రద్దు స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసి నేటి నుంచే అమలు చేస్తామన్నారు. అంతేకాక పూర్వం ఉన్న అర్చన అనంతరం దర్శనం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించనట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థమే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
12 నుంచి 21 వరకు ప్రత్యేక, బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాదిలోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. 3న గోకులాష్టమి ఆస్థానం.. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సెప్టెంబర్ 3న రాత్రి 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం వేడుకగా నిర్వహించనున్నారు. -
ప్రొటోకాల్ ప్రముఖులకే బ్రేక్ దర్శనం
సాక్షి, తిరుమల : సంవత్సరాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. కాబట్టి గోకులం భవనంలోని జేఈవో కార్యాలయంలో శుక్రవారం నుంచి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని, ఈ నిర్ణయాన్ని జనవరి మొదటి వారంలో మళ్లీ సమీక్షిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా ఈ నెల 28 నుంచి జనవరి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆర్జిత సేవలను, దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవని అధికారులు తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడంతో ఏకాంతంగా అభిషేకం నిర్వహించిన తరువాత ప్రముఖులకు బ్రేక్ దర్శనం ప్రారంభిస్తారు. లఘు దర్శనం మాత్రమే అమలుచేస్తారు. హారతి ఉండదు. మహద్వార ప్రవేశం ఉండదు. టికెట్లపై సూచించిన మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
బ్రేక్ దర్శనం టికెట్లలో భారీ కుంభకోణం
తిరుపతి: తిరుమలకు వెళితే నామాలు పెట్టుకోవడం ఆనవాయితీ, కాకపోతే అవినీతి అథికారులు స్వామివారికే నామాలు పెట్టారు. శ్రీవారి టికెట్లను అక్రమంగా నల్లబజారులో అమ్ముకున్నారు. దేవస్థానానికి రావాల్సిన ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకున్నారు. స్వామివారి ఆదాయాన్ని లడ్డులా ఆరగించారు. చివరకు పోలీసులకు చిక్కారు. శ్రీవారి బ్రేక్ దర్శనంలో భారీకుంభకోణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న అవినీతి దందాని పోలీసులు చేధించారు. బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను తిరుమల తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్న 9మంది దళారీలను పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ సూపరిడెంట్ ధర్మయ్య వీరందరికి ఎన్నో ఏళ్లుగా సహకరిస్తున్నారు. కీలక నిందితుడైన ధర్మయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.