నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో టీటీడీదే ప్రథమ స్థానం. టీటీడీ వాడుతున్న టెక్నాలజీ మరే దేవస్థానం వాడుకోలేకపోతున్నాయి. అధునాతన టెక్నాలజీ వినియోగించి శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను కల్పించాలన్న ధ్యేయంతో టీటీడీ ప్రతినిత్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానని అందిపుచ్చుకుంటుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ నుంచి.. వివిధ రకాల సేవలతో పాటుగా డొనేషన్స్ సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది టీటీడీ. ఇక నిఘా నేత్రాలకి కావాల్సిన అత్యాధునిక అనలిటిక్స్ పరిజ్ఞానం జోడించి.. తోపులాటలు సకాలంలో గుర్తించేలా సీసీటీవీ టెక్నాలజీని వినియోగిస్తుంది.
సామాన్య భక్తులకు గదుల కేటాయింపు.. ఎస్‌ఎస్‌డీ టైం స్లాట్ కేటాయింపు కూడా నూతన టెక్నాలజీ వినియోగించే ముందుకు సాగుతుంది. తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు.. దర్శనం క్యూలైన్.. గదుల కేటాయింపు కౌంటర్.. ఈవో కార్యాలయం.. చైర్మన్ కార్యాలయం.. వసతి గదులకు వెళ్లాలంటే కొంత కాస్త తరమే. అడ్రెస్స్ కనుకొని వెళ్లే లోపే తిప్పలు తప్పవు. భక్తులు ఎదుర్కొంటున్న తిప్పలు తప్పించేందుకు టీటీడీ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశ పెట్టింది. తిరుమలలోని కాటేజ్ బుకింగ్ కార్యాలయాల వద్ద ఈ టెక్నాలజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
మెరుగైన సేవలను అందించాలని టీటీడీ ప్రతి నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. భక్తులు అనేక సందర్భాలలో గదుల కేటాయింపు అనంతరం తమ గదులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే వారు. ఈ ఇబ్బందిని భక్తులు అతిక్రమించడానికి నయా ఆలోచనకు నాంది పలికింది. ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేశారు.
భక్తులు బస్టాండ్‌లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్‌ను తమ మొబైల్‌లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. మనం వెళ్లాల్సిన ప్రాంతం పేరు క్రింద క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే మ్యాప్ డిస్‌ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. గతంలో సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. ఈ విధానం శ్రీవారి సేవకుల ద్వారా అమలు చేసి సత్ ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్‌లను ఎంబీసీ.. సీఆర్ఓ వద్ద ఏర్పాటు చేసింది. వారికి కేటాయించిన గదులకు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది టీటీడీ.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి నుండి ఈ విధానాన్ని అమలుచేస్తోంది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్‌ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్‌లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండే అవసరం లేకుండా టీటీడీ కొత్తగా ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్ పే సిస్టమ్ చాలా బాగుంది అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment