సాక్షి, తిరుమల : ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చెయ్యమని అధికారులను ఆదేశించినట్లు టీటీడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్రేక్ దర్శనాల రద్దు స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసి నేటి నుంచే అమలు చేస్తామన్నారు. అంతేకాక పూర్వం ఉన్న అర్చన అనంతరం దర్శనం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించనట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థమే తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment