
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 9కి బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొండపైన రిసెప్షన్ కార్యాలయంలో ఉద యం 8.30 నుంచే భక్తులు బ్రేక్ దర్శనం కోసం రూ.300 టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం నుంచి ఉత్తర ప్రథమ ప్రాకార మండపంలోకి చేరుకున్నారు. 9గంటల సమయంలో భక్తులను తూర్పు త్రితల రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతిచ్చారు. బ్రేక్ దర్శనాలతో రూ.87,600 ఆదాయం సమకూరింది.
8న ఆలయం మూసివేత
నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ఉదయం 8.15 నుంచి రాత్రి 8 వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. రాత్రి 8.గంటలకు ఆలయాన్ని తీసి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారని వివరించారు.
10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారన్నారు. కార్తీక పౌర్ణ మి సందర్భంగా స్వామి వారికి నిర్వహించే అన్నకూటోత్సవం లాంఛనంగా నిర్వహిస్తా మని తెలిపారు. కాగా చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రీశుడి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు రద్దు చేసినట్లు ఈఓ తెలిపారు.