తిరుమల: శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న దీపావళి ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజున బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా 23న సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు. అలాగే, 25న సూర్యగ్రహణం నాడు ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా ఆ రోజున బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో 24న సిఫార్సు లేఖలు స్వీకరించరు.
నవంబర్ 8న చంద్రగ్రహణం నాడు ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా ఆ రోజున కూడా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో నవంబర్ 7న సిఫార్సు లేఖలను స్వీకరించరు.
కాగా, 25, నవంబర్ 8న శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 20 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,420 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.28 కోట్లు వేశారు. (క్లిక్: యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం)
Comments
Please login to add a commentAdd a comment